Site icon HashtagU Telugu

Revanth Reddy: రేవంత్ కు ‘బీహార్’ దడ

Revanth

Revanth

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండురోజుల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీహార్‌కు చెందిన బ్యూరోక్రాట్‌లను ఉన్నత పదవుల్లో నియమించారని, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ నుంచి సలహాలు తీసుకున్నారని, సీఎం కూడా బీహార్ ములాలున్న వ్యక్తి అని టీఆర్ఎస్ అధినేతపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, మరొక కాంగ్రెస్ నాయకుడు కూడా ఇదే తరహా కామెంట్స్ చేశారు.

అయితే ఈ విషయమై ఎన్డీఏ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టింది. “బీహార్‌లో కాంగ్రెస్ చాలా కాలంగా ఇలాగే వ్యవహారిస్తోంది. ఇతర చోట్ల ఆ పార్టీ నాయకుల ప్రవర్తన చాలా ఘోరంగా ఉంది. కాంగ్రెస్ నాయకులు తమ తీరును మార్చుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని జేడీ(యు) సీనియర్ నాయకుడు, సంజయ్ కుమార్ ఝా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పతనానికి కారణమవతాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి ప్రత్యర్థి అయిన లాలూ ప్రసాద్‌కు చెందిన ఆర్జేడీ నేతలు కూడా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ, ఆలస్యంగా కాంగ్రెస్‌తో పాత పొత్తుకు వెనుదిరిగినట్లు కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ ఆనంద్ కూడా రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

‘‘ఇటీవల చన్నీ ప్రియాంక గాంధీ వాద్రా సమక్షంలో ప్రజలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ అలాంటిదే చేశాడు’’ అని ఆనంద్ అన్నారు. బీహార్‌లోని కాంగ్రెస్ నేతలు తమ పార్టీని కాపాడుకోవడం చాలా కష్టమైంది.  ఈ విషయమై రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ కూడా అయిన సమీర్ కుమార్ సింగ్ రియాక్ట్ అవుతూ  “రేవంత్ రెడ్డి బీహార్‌ను కించపరిచే ప్రయత్నం చేయలేదని, కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని మాటలదాడికి దిగారని స్పష్టం చేశారు.