Site icon HashtagU Telugu

Palvai Sravanthi: మునుగోడులో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ ఆశలు

Palvai Sravanthi

Palvai Sravanthi

మునుగోడులో చాపకింద నీరులా కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లను భారీగా రాబట్టేలా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా స్రవంతి ప్లాన్ చేశారు. స్వర్గీయ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అభిమానులు , మహిళా ఓటర్ల మీద కాంగ్రెస్ కన్నేసింది. ఊహించనంతగా మహిళా ఓటర్లను స్రవంతి అనుకూలంగా మలుచుకున్నారని ప్రత్యర్థులు గ్రహించారట. అందుకే వెంటనే మేల్కొన్న బీజేపీ , టి ఆర్ ఎస్ పార్టీలు నష్ట నివారణ చర్యలకు దిగాయని తెలుస్తుంది.

నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నియోజకవర్గంలోని 1.2 లక్షల మంది మహిళా ఓటర్లలో ఎడ్జ్ సాధించడం ద్వారా చాలా మందిని ఆశ్చర్యపరిచారు. ప్రచారం ముగియకముందే ఆమెను టీఆర్‌ఎస్, బీజేపీ లెక్కలోకి తీసుకోనప్పటికీ స్రవంతి పట్టుదలతో మహిళల ఓట్లను తనవైపు మలుచుకున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలు కూడా తమ మహిళా నేతలను ప్రచారం కోసం రంగంలోకి దింపినప్పటికీ వారికి గుర్తింపు లేదు.

Also Read:  Munugode: 95% పై గులాబీ గుస్సా, మునుగోడు ఓటర్లకు `విమాన` యోగం

ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ దనసరి అనసూయ, స్రవంతి ఆశయ సాధనకు కోసం తనవంతుగా కృషి చేస్తూనే ఉన్నారు. మంగళవారం, డాక్టర్ సీతక్క తన ప్రచార సమావేశాలలో కాకతీయ రాజవంశం యోధురాలు రాణి రుద్రమగా అభివర్ణించినప్పుడు వచ్చిన స్పందన కాంగ్రెస్  కేడర్‌కు కొత్త ఊపు ఇచ్చింది. రుద్రమదేవి అనేక సవాళ్లను ఎదుర్కొని ధైర్యంగా వాటిపై పోరాడిన తీరు, మహిళ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు బలమైన సందేశం పంపేందుకు పాల్వాయి స్రవంతి తీవ్రంగా పోరాడుతున్నారు.

మరోవైపు స్రవంతిని ఎదుర్కోలేక బెదిరింపు వ్యూహాలతో బీజేపీ దూసుకుపోతోంది. ఆ పార్టీ అనుచరులు స్రవంతికి అడ్డంకులు సృష్టిస్తూ ప్రచారానికి ఆటంకం కలిగిస్తున్నారు. అదే సమయంలో డబ్బు, మద్యం పంపిణీ ద్వారా తన ప్రచారాన్ని గట్టెక్కించాలని అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది. మహిళా ఓటర్ల నుంచి మాత్రం స్రవంతికి విశేష స్పందన లభిస్తోంది.

Also Read:   Congress President : కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే పదవీస్వీకారం

చౌటుప్పల్ మండల పార్టీ ప్రచార ఇన్‌చార్జి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి మాట్లాడుతూ.. డబ్బు, కండబలం మీద ఆధారపడే శక్తిమంతులపై పోరాడే ధైర్యం మహిళలకు ఉందని స్రవంతి నిరూపిస్తోందని అన్నారు. ఆమె తన ప్రచారంపై దృష్టి కేంద్రీకరించడానికి ఇందిరా గాంధీ మరియు సోనియా గాంధీ వంటి గొప్ప నాయకుల నుండి ప్రేరణ పొందుతోందని కితాబు ఇచ్చారు . స్రవంతి సైద్ధాంతిక పోరాటం చేస్తూ విజయం సాధిస్తుందని అన్నారు. “స్రవంతి తన పోరాటంలో ఒంటరిగా లేదు. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన తెలంగాణ మహిళలంతా ఆమెకు మద్దతు పలుకుతున్నారు. ఆమె విజయం మహిళా సాధికారతకు చిహ్నం అవుతుంది.` అంటూ కాంగ్రెస్ మహిళా లీడర్లు కూడా ప్రచారం చేయడం ఆ పార్టీ కి ప్లస్ గా కనిపిస్తుంది.