Site icon HashtagU Telugu

BRS VS Congress : కేటీఆర్ బినామీలను బయటపెట్టిన కాంగ్రెస్

Manavath Rai Ktr

Manavath Rai Ktr

తెలంగాణ (Telangana) రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. సీఎం గా పదవి చేపట్టిన దగ్గరి నుండి రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనా కొనసాగిస్తూ..ఓ పక్క ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాదు..రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొస్తుండడం బిఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. పదేళ్ల తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఫై , సీఎం రేవంత్ ఫై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో తామే గొప్ప అనే విధంగా ఎక్స్పోజ్ చేసుకోవాలని చూస్తుంది. కానీ పదేళ్లలో కేసీఆర్ చేసిన తప్పులు..ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ దోచుకున్న సొమ్మును కాంగ్రెస్ బయటపెడుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోద‌రులు తిరుప‌తి రెడ్డి, కొండ‌ల్ రెడ్డి, జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డిల ఫై బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ గట్టి కౌంటర్లు ఇవ్వడమే కాదు సంచలన విషయాలు బయటపెడుతూ..బిఆర్ఎస్ నేతలకు చెమటలు పట్టిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో కేటీఆర్ బినామీ పేర్లతో డొల్ల కంపెనీలు సృష్టించి వందల కోట్లు వెనకేసుకున్నాడంటూ కాంగ్రెస్ పక్క ఆధారాలతో బయటపెట్టడం మొదలుపెట్టింది. విదేశాల్లో విహార యాత్రలకు వెళ్లి, షాడో కంపెనీలు తెచ్చి పెట్టుబడులు అంటూ బిల్డప్ ఇచ్చిన డ్రామారావా..(KTR ) ఎన్నారైల వద్ద పార్టీ ఫండ్ వసూలు కోసం తిరుగుతూ, టైం పాస్ చేస్తూ.. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చానంటూ గప్పాలు కొట్టిన నువ్వా పెట్టుబడుల గురించి మాట్లాడేది..? అంటూ కాంగ్రెస్ నేత మానవతా రాయ్ (Manavatha Rai) ప్రశ్నించారు. నీ అనుచరుల పేర్లపై ఉన్న డొల్ల కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకొని.. వందల కోట్ల పెట్టుబడులు తెచ్చానంటూ అసత్య ప్రచారం చేసుకున్న విషయం మర్చిపోయినవా..? ఇన్‌క్రెడిబుల్ హస్క్ గ్రూప్ CEO సీకా చంద్ర శేఖర్‌కు ఎటువంటి వ్యాపార అనుభవం లేకున్నా.. ఆ కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకున్నది అతను కేవలం మీ పార్టీ మద్దతుదారుడు అనే కదా? రాష్ట్రానికి పెట్టుబడులు తీస్కురావడంలో మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి షాడో కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకొని.. పబ్లిసిటీ చేసుకొని తర్వాత ఆ ఎంవోయూలను చెత్తబుట్టలో పడేయడం వాస్తవం కాదా? అంటూ మానవతా రాయ్ సూటి ప్రశ్నలు సంధించారు.

లండన్‌లో మే 13, 2023న హస్క్ గ్రూప్‌లోతో మీరు చేసుకున్న MoUలు, మీ షాడో కంపెనీ హస్క్ గ్రూప్ CEO సీకా చంద్ర శేఖర్‌ బాగోతం, ఆ కంపెనీ వివరాలతో సహా సాక్ష్యాధారాలివిగో అంటూ పలు ఆధారాలను బయటపెట్టారు. ఇక ముందు నుండి రేవంత్ రెడ్డి సోదరులు వ్యాపారాల్లో ఉన్న సంగతి తెలిసిందే. యూకే లో తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కొండల్ రెడ్డి వెళ్లడాన్ని తప్పు పడుతున్న బిఆర్ఎస్..గతంలో ఇదే అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ , రఘునందన్ రావు తదితరులు వెళ్లగా తప్పులేదు కానీ..ఇప్పుడు కొండల్ రెడ్డి వెళ్లడాన్ని తప్పు పడుతుందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అప్పుడు లేని ఆరోపణలు ఇప్పుడు చేయడం ఏంటి అని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. నిర్వాణ హెల్త్ కంపనీ లో కేటీఆర్ కు భాగం ఉందని..ఆ కంపనీ డైరెక్టర్స్ -రవి , ఆనంద్, సిద్ పగిడిపాటి వాళ్లంతా కేటీఆర్ కు బినామానిలే అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కొండల్ రెడ్డి ప్రవైట్ కార్యక్రమానికి వెళ్లడాన్ని..అక్కడ పార్లమెంట్ భవనం వెళ్లడం..అక్కడ కూర్చోవడం ఫై బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం కాంగ్రెస్ బయటపెడుతున్న ఆధారాలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇవే జస్ట్ శాంపిల్ మాత్రమే అని..ఇలాంటి చాల ఉన్నాయని..అతి త్వరలో మరిన్ని బయటపెడతానంటూ మానవతా రాయ్ హెచ్చరించారు. ఈ హెచ్చరికలు , ఆధారాలతో బిఆర్ఎస్ నేతలు తలపట్టుకుని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే పలు స్కామ్ లు కేసీఆర్ ఫ్యామిలీ ని వెంటాడుతుండగా..ఇప్పుడు కొత్తగా అమెరికా పెట్టుబడులు , బినామీ వ్యవహారాలు బయటకు వస్తుండడంతో ఇవి ఎన్ని తిప్పలు తెస్తాయో అని ఖంగారు పడుతున్నారు. ఒకటి అనుకుంటే ఒకటి అయ్యేదే అని ఇప్పుడు వారంతా నాలుక కార్చుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఇక మానవతా రాయ్ ఏమన్నారు..? ఎలాంటి విషయాలు బయటపెట్టారు..? బిఆర్ఎస్ ప్రభుత్వ టైములో జరిగిన డొల్ల పెట్టుబడులు ఇవన్నీ ఈ కింది లింక్ లో చూడొచ్చు.

Read Also : Pawan Kalyan : పవన్ ఎవర్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు – నాదెండ్ల మనోహర్