Site icon HashtagU Telugu

Revanth Reddy: భాగ్యలక్ష్మి ఆలయం సాక్షిగా ఈటలకు సవాల్ విసిరిన రేవంత్‌.. నన్ను కొనేవాడు ఇంకా పుట్టలేదంటూ ఫైర్..!

Revanth Reddy

Revanth Reddy Secret Survey On Candidates

నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక (Munugode bypoll) సందర్భంగా బీఆర్‌ఎస్‌ (BRS) నుంచి కాంగ్రెస్‌ (Congress) రూ.25 కోట్లు స్వాహా చేసిందన్న ఆరోపణలను బీజేపీ శాసనసభ్యుడు ఈటల రాజేందర్‌ బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు రేవంత్ రెడ్డి (Revanth Reddy). ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)పై గత కోనేళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి తానేనని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. తనను ఎవరూ కొనలేరని, తన రాజకీయ జీవితంలో ఎవరికీ లొంగిపోనని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆలయానికి వచ్చి దేవతపై ప్రమాణం చేసి తన ఆరోపణను పునరావృతం చేయాలని ఈటల రాజేందర్‌ కు రేవంత్ సవాలు విసిరారు.

రాజేందర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. చంద్రశేఖర్‌రావును ముఖ్యమంత్రి పదవి నుంచి దించడమే నా లక్ష్యం, నాపై 130కి పైగా కేసులు నమోదయ్యాయని, ఇది నన్ను అడ్డుకోవడం లేదని, ముఖ్యమంత్రిపై నా పోరాటం కొనసాగిస్తానని అన్నారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో మద్యం అమ్మకాల ద్వారా 300 కోట్లు రాబట్టారు. రాజకీయ పార్టీలు కోట్లు ఖర్చుపెట్టాయి. అయితే పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కోసం 25,000 ఓట్లు సాధించిన ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ ఏమీ ఖర్చు చేయలేదని ఆయన అన్నారు.

Also Read: Amritpal Singh Arrested: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన అమృత్ పాల్ సింగ్.. నెల రోజుల తర్వాత అరెస్ట్

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేపట్టిన నిరసనల గురించి రాజేందర్‌కు తెలుసు అని రేవంత్ అన్నారు. “ఇది ఇప్పుడు నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. రాజేందర్ తన ఆరోపణలను నిరూపించాలి” అని TPCC చీఫ్ అన్నారు. మరికొన్ని చోట్ల రాజేందర్ స్పందిస్తూ తన ఆరోపణపై తాను నిలబడతానని చెప్పారు. హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో ఒక్కో ఓటరుపై రాజకీయ పార్టీలు రూ.6 వేలు ఖర్చు చేశాయన్నారు. బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని, వారి నేతల భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారని, రేవంత్‌ రెడ్డికి నేను భయపడనని ఈటల అన్నారు. రేవంత్ గుడిలో ప్రమాణం చేయడం చీఫ్ ట్రిక్ గా భావిస్తున్నానని బీజేపీ నేత రాజేందర్ అన్నారు.