MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

'క్రికెట్‌లో కోహ్లికి తిరుగులేదు.. కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ ను మించినోడు లేడు'

Published By: HashtagU Telugu Desk
T Congres Counter

T Congres Counter

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముందు నుండి కూడా బిఆర్ఎస్ పార్టీ దూకుడు కనపరుస్తుంది, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ పక్క ప్రజా ఆశీర్వాద సభ ల పేరిట ప్రజల్లోకి వెళ్తుంటే..కేటీఆర్ రోడ్ షో లు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. మరోపక్క హరీష్ రావు..ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి లాక్కునేపనిలో బిజీ గా ఉన్నారు. ఇక కవిత సైతం నియోజకవర్గంలో పర్యటిస్తూ..సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఇలా బిఆర్ఎస్ నేతలు దేనిని వదిలిపెట్టకుండా ప్రచారం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కోహ్లీ 50 వ సెంచరీ చేసి రికార్డ్స్ చేయడాన్ని కూడా కవిత తమకు అనుకూలంగా మార్చుకొని వార్తల్లో నిలిచింది.

విరాట్ కోహ్లీ (Virat Kohli) సరికొత్త రికార్డుని క్రియేట్ చేసి చ‌రిత్ర (Virat Kohli Hits Record-breaking 50th ODI Century )సృష్టించారు. ప్రపంచ వ‌న్డే చరిత్రలో అత్యధిక రికార్డులను సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మొన్నటి వరకు ఈ రికార్డు సచిన్ (Sachin Tendulkar) పేరు మీద ఉండే..ఇప్పుడు సచిన్ ను పక్కకు జరిపి..ఆ స్థానంలో కోహ్లీ నిలిచాడు. వ‌న్డే వరల్డ్ కప్ (2023 World Cup) లో భాగంగా నేడు ముంబైలోని ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌, భారత్ మధ్య సెమీ ఫైనల్ (India vs New Zealand Semi Final) మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ సాధించి సచిన్ రికార్డు ను బ్రేక్ చేసాడు. కోహ్లీ రికార్డు ఫై క్రికెట్ అభిమానులే కాదు సినీ , రాజకీయ ప్రముఖులు సైతం స్పందించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కూడా కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కోహ్లీని తన తండ్రి కేసీఆర్‌ (KCR)తో పోలుస్తూ కవిత ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీకి కూడా సీఎం కేసీఆర్ లాగా పరిస్థితి ఎదురుకాలేదని.. మాస్టర్ ఫీల్డ్ లో ఉంటే.. కచ్చితంగా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని కవిత ట్వీట్ చేశారు. అలాగే..క్రికెట్‌లో కోహ్లికి తిరుగులేదని, తెలంగాణలో కేసీఆర్ ఎదురుచూడడం లేదని కవిత తన ట్వీట్‌లో కేసీఆర్, కోహ్లీలతో ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు. ఈ ట్వీట్ కు టీ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ‘క్రికెట్‌లో కోహ్లికి తిరుగులేదు.. కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ ను మించినోడు లేడు’ అంటూ కవిత ట్వీట్‌ను జత చేసింది.

Read Also : Gali Anil Kumar : బిఆర్ఎస్ లోకి గాలి అనిల్ కుమార్‌..

  Last Updated: 16 Nov 2023, 12:37 PM IST