Telangana: ఏరుదాటాక తెప్ప తగలేయడం మామా అల్లుళ్లకు అలవాటేగా

తెలంగాణాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తుంది. కొంతకాలం బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించినప్పటికీ, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల కారణంగా

Published By: HashtagU Telugu Desk
Telangana

New Web Story Copy (25)

Telangana: తెలంగాణాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తుంది. తెలంగాణాలో కొంతకాలం బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించినప్పటికీ, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ప్రజల్లో బీజేపీపై నమ్మకం పోయింది. ఈ క్రమంలో తెలంగాణాలో కాంగ్రెస్ ఒక్కసారిగా దూసుకొచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుంది. ఈ మధ్య పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికతో పార్టీ బలం మరింత పుంజుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరుపై నిత్యం విమర్శలతో విరుచుకుపడుతుంది. తాజాగా మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ఆరోపణలు గుప్పించింది.

తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీలపై ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ స్పందించింది. బీఆర్ఎస్ ఎవరినైనా అవసరానికి వాడుకుంటుందని, అవసరం తీరాక నిండా ముంచుతుందని పేర్కొంది. ఏరుదాటాక తెప్ప తగలేయడం మామా అల్లుళ్లకు అలవాటేనని మరో సారి రుజువు చేశారు హరీష్ గారూ అంటూ ట్విట్టర్ ద్వారా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మునుగోడులో కమ్యూనిస్టుల మద్ధతుతో గెలిచి ఇప్పుడు ఎర్రజెండా మోసేటోడే లేడని మాట్లాడుతున్నారు అంటూ మండిపడింది కాంగ్రెస్. ఈ ఊసరవెల్లుల గురించి కమ్యూనిష్టు సోదరులు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే వారికి, సమాజానికి అంత మంచిదని సూచించింది.

Also Read: Gandeevadhari Arjuna Teaser : గాండీవధారి అర్జున టీజర్ టాక్ ..

  Last Updated: 24 Jul 2023, 01:45 PM IST