Site icon HashtagU Telugu

Congress contestants : నోటుకు టిక్కెట్ ! కాంగ్రెస్ అధిష్టానంకు ఫిర్యాదుల వెల్లువ‌!!

Congress Contestants

Congress Contestants

Congress contestants :  కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌. వ్య‌క్తిగ‌త స్వేచ్ఛకు అవ‌ధులుండ‌వ్. ఇప్పుడు అదే ఆ పార్టీకి న‌ష్టం క‌లిగించేలా ఉంది. అధిష్టానం ఎంత వ‌ద్ద‌న్నా ఫిర్యాదుల వెల్లువ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఢిల్లీ చేరుతున్నాయ‌ని తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీలోని ఓ కీల‌క నేత టిక్కెట్లు ఇప్పిస్తాన‌ని కోట్ల రూపాయాలు తీసుకున్నాడ‌ని వీహెచ్ తో పాటు మాజీ పీసీసీ చీఫ్ వ‌ద్ద‌కు ఫిర్యాదులు వెళ్లాయ‌ని తెలుస్తోంది. వాటిని ఏఐసీసీ వ‌ద్ద‌కు వాటిని చేర్చార‌ని అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో ఇద్దరు ఎన్నారైల మధ్య గొడవ (Congress contestants)

జ‌న‌గాం టిక్కెట్ ను పొన్నాల లక్ష్య‌య్య ఆశిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ఆయ‌న అక్క‌డి నుంచి రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయ‌న్ను కాద‌ని మ‌రొక‌రిని పార్టీలోని కీల‌క నేత ప్రోత్సహిస్తున్నార‌ని టాక్‌. త‌మ నాయ‌కునికి టిక్కెట్ ఇవ్వ‌కుండా అడ్డుకోవ‌డానికి కార‌ణం డ‌బ్బులు చేతులు మార‌డ‌మేన‌ని (Congress contestants)  పొన్నాల అనుచరుల ఆరోప‌ణ‌. ఇక సూర్యాపేటలోనూ ఇదే త‌ర‌హా ఆరోప‌ణ‌ల‌కు పునాది ప‌డింది. అక్క‌డి బ‌ల‌మైన నేత‌ను కాద‌ని టీడీపీ నుంచి వ‌చ్చిన మ‌రో లీడ‌ర్ ను కీల‌క నేత‌ల ప్ర‌మోట్ చేయ‌డంపై ఆరోప‌ణ‌ల ప‌ర్వం కొనసాగుతోంది.

జ‌న‌గాం టిక్కెట్ ను పొన్నాల లక్ష్య‌య్య

ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ట్రాన్స్‌పోర్ట్‌ ఆపరేటర్ భారీగా పైస‌లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ట్టు ప్ర‌చారం చేసుకుంటున్నారు. అదే ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఓ బీసీ నేత ఈ ప్ర‌చారం తెలిసి నివ్వెరపోతున్నారు. బీసీలను తొక్కేస్తున్నారని, తాను కూడా ఈ కుట్రలో బలైపోతున్నానని సన్నిహితుల వద్ద ఆయన  (Congress contestants) ఆందోళ‌న చెందిన‌ట్టు తెలుస్తోంది. ఇక వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో ఇద్దరు ఎన్నారైల మధ్య గొడవ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓ మహిళా ఎన్నారైకి టిక్కెట్టు వచ్చేలా సర్వేలు సిద్దం కావ‌డం వెనుక కాంగ్రెస్ పార్టీలోని కీల‌క నేత ఉన్నార‌ని స్థానికంగా న‌డుస్తోన్న చ‌ర్చ‌.

ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ట్రాన్స్‌పోర్ట్‌ ఆపరేటర్

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓ మాజీ మంత్రిపై పోటీచేయాలని ఉవ్విళూరుతున్నారు. కానీ, అక్క‌డ ఓ యువనేత టిక్కెట్ కోసం రెండువిడతల్లో రూ. 3 కోట్లు సమర్పించుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే టికెట్‌ ఆశిస్తున్న ఓ మహిళా నేత కీలక నేతకు రూ. 10 కోట్లు ఇచ్చానని స‌న్నిహితుల వ‌ద్ద చెప్పుకుంటున్నార‌ట‌. అంతేకాదు, టికెట్‌ తనకేనని ఆమె చెప్పుకుంటున్నట్టు పార్టీ వర్గాలు ద్వారా ఢిల్లీకి చేరింది. టికెట్‌ ఆశిస్తున్న మరో నేత తాను కూడా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమని (Congress contestants)  పీసీసీ మాజీ చీఫ్‌తో మొరపెట్టుకున్నట్టు వినికిడి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే టికెట్‌ ఆశిస్తున్న ఓ మహిళా నేత (Congress contestants)

నల్లగొండ జిల్లాలో ఓ నేత చేరికను మరో నేత అడ్డుకున్నారు. ఇప్పుడు అదే నేత అక్కడి నుంచి బరిలోకి దిగుతుండడం వెనక మతలబు ఏంటన్నది నియోజకవర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు. వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో ఇద్దరు ఎన్నారైల మధ్య గొడవను కాంగ్రెస్ లోని కీల‌క నేత వాడుకుంటున్నాడ‌ని టాక్‌. మహిళా ఎన్నారైకి టిక్కెట్టు వచ్చేలా సర్వేలు సిద్ధమయ్యాయని, ఇప్పటికే ఆమె పేరు అధిష్ఠానానికి చేరిందని సమాచారం. ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి జిల్లాలో టికెట్‌ ఆశిస్తున్న ఓ దళిత నేతను కూడా వీరు వదిలిపెట్టలేదని సమాచారం. ఆయన కూడా 5 కోట్లు ఇచ్చుకున్నట్టు సన్నిహితుల (Congress contestants) మందుపార్టీలో వాపోయార‌ట‌. నాగర్‌కర్నూలు టిక్కెట్‌ ఆశిస్తున్న మరో నేత రూ.3 కోట్లు స‌మ‌ర్పించుకున్న‌ట్టు టాక్.

Also Read : Power of Congress : తెలంగాణ‌లో `ఛాన్స్`పై రాహుల్ అస్త్రం

విచిత్రంగా ఈసారి ఎన్నారైలు సైతం కాంగ్రెస్ టిక్కెట్ల‌ను ఆశిస్తూ పోటీప‌డుతున్నారు. అందు కోసం ఓ ఎన్నారై వద్ద అమెరికాలోని రెండు విల్లాలను కాంగ్రెస్ కీల‌క నేత రాయించుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అత‌ని సోదరుడి కుమారుడి పేరుతో ఆ విల్లాల‌ను రాయించుకున్నట్టు అమెరికా ఎన్నారై వ‌ర్గాల్లోని టాక్‌. ఫ‌లితంగా ఇప్పుడు ఆ ఎన్నారై పేరు స‌ర్వేల్లో టాప్‌ ప్లేస్‌కి చేరినట్టు తెలుస్తోంది. సుమారు రూ. 5 వేల కోట్ల ఆస్తి ఉన్న ఆ ఎన్నారై ఇండియాలో పోటీ చేయాలన్న (Congress contestants)  కోరిక నెర‌వేర‌బోతుంద‌ని స‌మాచారం.

Also Read : Congress Strategy: కాంగ్రెస్ పొలిటికల్ స్కెచ్, ఎన్నికల బరిలోకి గద్దర్ ఫ్యామిలీ

ఇక జహీరాబాద్‌ ఎంపీ స్థానం కోసం పోటీపడుతున్న ఓ ఎన్నారైని అడ్వాన్స్‌గా రూ. 25 కోట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నేత ఒక‌రు డిమాండ్ చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన ఓ ఎన్నారై కూడా డబ్బులు సమర్పించుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆయనతో భారీగా ఖర్చు చేయించినట్టు వినికిడి. మహేశ్వరం కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఐదెకరాలు, రూ.10 కోట్లు చేతులు మారిన‌ట్టు కాంగ్రెస్‌ బహిష్కృత నేత కొత్త మనోహర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.

ఇలా తెలంగాణ వ్యాప్తంగా ప‌లు చోట్ల టిక్కెట్ల ఇప్పిస్తాన‌ని చెబుతూ ఓ కీల‌క నేత భారీగా వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్టు ఏఐసీసీ వ‌ద్ద‌కు ఫిర్యాదులు వెళ్లాయ‌ని తెలుస్తోంది. అంతేకాదు, స‌ర్వేలు బోగ‌స్ అంటూ కాంగ్రెస్ లోని సీనియ‌ర్లు కొంద‌రు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లార‌ని ఢిల్లీ వ‌ర్గాల ద్వారా అందుతోన్న స‌మాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ టిక్కెట్ల ఖ‌రారు గంద‌ర‌గోళంగా మార‌నుందని అభిమానుల్లో అల‌జ‌డి మొద‌ల‌యింది.