Site icon HashtagU Telugu

Congress : బీఆర్ఎస్ సర్కార్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Congress Complaint To Ec Ag

Congress Complaint To Ec Ag

మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి..ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ను కాంగ్రెస్‌ (Congress) నేతలు కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఆయన్ను కలిసి పిర్యాదు (Congress Complaint To EC Against KCR Government) చేసారు. శనివారం ఉదయం ఈసీ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు నాలుగు అంశాల విషయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసారు.

ప్రభుత్వ నిధులను కాంట్రాక్టర్లకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌ స్వయంగా ఎలక్షన్‌ కమిషన్‌ కార్యాలయానికి వెళ్లి పరిథితులు తెలిపి పిర్యాదు పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా నాలుగు అంశాలను తమ ఫిర్యాదులో కీలకంగా మెన్షన్‌ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్ఎస్‌ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు మంజూరు చేసారని , రైతుబంధు నిధులను ఇందుకోసం వాడుతున్నారు అనేది మరో ఆరోపణ. ఇక భూ రికార్డులు కూడా చాలా వరకూ మార్చేస్తున్నారని, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని భూముల్ని ధరణి పోర్టల్‌లోకి మారుస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్‌ నిఘా పెట్టాలని అధికారులను కోరారు. ఇక డిసెంబర్‌ 4న కేసీఆర్‌ ఏర్పాటు చేయబోయే కేబినెట్‌ మీటింగ్‌ గురించి కూడా తమ పిర్యాదులో పేర్కొన్నారు కాంగ్రెస్‌ నేతలు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున.. ఈ మీటింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కోరారు.

Read Also : YS Sharmila Son Rajareddy : ప్రేమలో పడ్డ వైస్ షర్మిల కుమారుడు..? అమ్మాయిది ఏ కులమో తెలుసా..?