Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు

Kishan Reddy : కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

Published By: HashtagU Telugu Desk
Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy : కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ పేరును కిషన్ రెడ్డి ప్రస్తావించారని కంప్లైంట్‌లో పేర్కొంది. ఇలా మాట్లాడటం ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించడమే అవుతుందని కాంగ్రెస్ తెలిపింది. కిషన్ రెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును నమోదు చేయాలని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసురును హస్తం పార్టీ కోరింది.

We’re now on WhatsApp. Click to Join

‘‘నేను కుటుంబ సమేతంగా ఓటు వేశాను. చాలామంది స్నేహితులు, ఇరుగుపొరుగు వారు నాతో కలిసొచ్చి ఓటు వేశారు. ఎన్నికల వేళ హాలిడే ఇస్తారు. చాలామంది ఇవాళ మొత్తం సెలవు రోజులా గడపాలని భావిస్తారు. అది కరెక్టు కాదు. మీరు ఓటు వేసిన తర్వాత హాలిడే‌ను సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యపు పండుగ. ఓటు వేయడం ప్రాథమిక హక్కు అని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పదేపదే  చెబుతుండేవారు. దేశం కోసం.. దేశపు డెవలప్మెంట్ కోసం.. మనమంతా తప్పకుండా ఓటువేయాలి. మంచి నాయకులను, మంచి పార్టీలను ఎన్నుకోవాలి’’ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘నేను పోలింగ్ బూత్ నుంచి 100 ఫీట్ల దూరంలోకి వచ్చానని అనుకుంటున్నాను.. మళ్లీ ప్రధాని మోడీ సారథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడబోతోంది. దేశ ప్రజలు కూడా మళ్లీ మోడీ సర్కారే రావాలని కోరుకుంటున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. ఓటర్ల కిటకిటతో పోలింగ్ బూత్‌లలో పండుగ వాతావరణం నెలకొంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Also Read : Allu Arjun : ఓటు వేశాక.. ఎవరికి తన సపోర్టో చెప్పేసిన అల్లు అర్జున్

  Last Updated: 13 May 2024, 09:23 AM IST