Site icon HashtagU Telugu

Ponnala Resigns from Congress : పొన్నాల రాజీనామా ఫై కాంగ్రెస్ రియాక్షన్..

Ponnala

Ponnala

ఈసారి తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టేది మీమే అంటూ ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ( Ponnala) భారీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా ( Ponnala Resigns from Congress ) చేయడం కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కి సేవలు చేస్తూ వస్తున్న ఈయన..ఎన్నికల సమయంలో రాజీనామా చేయడం అందర్నీ కలిచివేస్తుంది. ప్రస్తుతం పొన్నాల బిఆర్ఎస్ పార్టీ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే పలువురు బిఆర్ఎస్ (BRS) కీలక నేతలు పొన్నాల తో చర్చలు జరిపారని , పొన్నాలకు జనగాం బిఆర్ఎస్ టికెట్ (ponnala jangaon brs candidate) ఇవ్వబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటె పొన్నాల రాజీనామా ఫై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మురళీధరన్ స్పందిస్తూ..పొన్నాల పోతే పోనివ్వండంటూ..ఆయన పోతే పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. అసలు పొన్నాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వదని ఎవరు అన్నారని ప్రశ్నించారు. ఈరోజు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. సమావేశం అనంతరం పొన్నాల రాజీనామా ఫై స్పందించారు.

అక్టోబర్ 15న కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తున్నామని, జాబితాలో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయత ఆధారంగా ఈరోజు సమావేశంలో 70 సీట్లపై కసరత్తు పూర్తయ్యిందన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరోసారి సమావేశమై.. మిగతా స్థానాలకు కసర్తుత పూర్తి చేస్తుందని తెలిపారు. మిత్రపక్షాల స్థానాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

Read Also : TDP : తెలంగాణలో టీడీపీ రాజకీయ వ్యూహం అదేనా?