Site icon HashtagU Telugu

Pahalgam Terror Attack : ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా నిర్మూలించాలి – సీఎం రేవంత్

Candlelight Rally Necklace

Candlelight Rally Necklace

పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి నిరసనగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth ) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ (Candlelight ) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఐఎంఐ ఎంపీ అసదుద్దీ, ఇతర ప్రముఖులతో పాటు దేశ ఫారిన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డు వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినదిస్తూ “ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా నిర్మూలించాలి” అనే నినాదాలు ఇచ్చారు.

Candlelight Rally Hyd

ర్యాలీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పహల్గాములో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం ఎంతో దురదృష్టకరమైన ఘటన అని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదాలకు సాయం చేసే వారిని తగిన శిక్ష వెయ్యాలని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా దేశం మొత్తం కలిసి ఉగ్రవాదంపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. పహల్గాం ప్రాంతంలో భారతీయ పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడులు దేశ ప్రజలను తీవ్రంగా కలచివేశాయి. ఈ పాశవిక చర్యలను దేశం మొత్తం ఖండిస్తోంది. ఇటువంటి దాడులు మళ్లీ జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని రాజకీయాలకు అతీతంగా చూస్తూ, దేశ భద్రత కోసం అందరూ కలిసి పోరాడాలి. ఉగ్రవాదంపై కేంద్రం తీసుకునే ప్రతీ చర్యకు మేమందరం మద్దతుగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

ఇదే సందర్భంలో, గతంలో 1967, 1971 యుద్ధాల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చూపిన నాయకత్వాన్ని జనం గుర్తు చేస్తున్నారు. అప్పట్లో పాక్‌ కు గట్టి బుద్ధి చెప్పినందుకు వాజ్‌పేయ్ ఆమెను దుర్గామాతతో పోల్చారు. ఇదే విధంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా దుర్గాభక్తుడిగా, దేశ భద్రత కోసం గట్టి నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఒక్క గట్టి దెబ్బతో పాకిస్తాన్ ను రెండుగా చేయాలన్న డిమాండ్ మళ్లీ వినిపిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి భారత్ లో విలీనం చేయాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు కోల్పోయిన తీరును దేశం తీరని విషాదంగా భావిస్తోంది. వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా మానసిక సహాయంగా నిలబడాలని కోరుతున్నారు. ప్రభుత్వ పరంగా వారు పొందాల్సిన న్యాయం అందించాలని, బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రజల నుంచి కోరుకుంటున్నారు. ఉగ్రవాదానికి తగిన ప్రతిస్పందన ఇవ్వడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో, దేశం మొత్తం ఒక్కటిగా నిలుస్తోంది అని రేవంత్ అన్నారు. ఈ దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించబడ్డాయి. గ్రామ గ్రామాన ప్రజలు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ, చనిపోయిన పర్యాటకులకు నివాళులర్పించారు.