Site icon HashtagU Telugu

Telangana Congress Candidates Second List : కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌ మరింత ఆలస్యం..?

Congress 2nd List

Congress 2nd List

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections 2023) పట్టుమని రెండు నెలలు కూడా లేవు..ఈ టైం లోకూడా కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం పట్ల కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారు..? ఎప్పుడు ప్రచారం మొదలుపెడతారు..? అంటూ వారంతా మాట్లాడుకుంటున్నారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని , ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పక్క అంటూ పలు సర్వేలు చెపుతున్న తరుణంలో ఇంకా అభ్యర్థులను ప్రకటించకుండా ఆలస్యం చేయడం ఏంటి అని వారంతా వాపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం 55 మందితో కూడిన మొదటి లిస్ట్ ను కాంగ్రెస్ ప్రకటించగా..ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దసరా సందర్బంగా మిగతా అభ్యర్థులను (Congress Candidates Second List) ప్రకటిస్తారని అంత భవిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు దసరా తర్వాతే రెండో విడత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అభ్యర్థుల రెండో జాబితాపై సుదీర్ఘ కసరత్తు జరుగుతుంది. మొదటి జాబితా తర్వాత అసంతృప్తులతో హైకమాండ్ ఆచితూచి అడుగులేస్తోంది. సీఈసీ మీటింగ్‌ తర్వాతే రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. రెండో జాబితాలో మిగిలిన అన్ని స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఢిల్లీకి పిలిపించి అధిష్టానం నేరుగా చర్చిస్తోంది. అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మాణిక్‌రావ్‌ ఠాక్రే తెలిపారు. అలాగే కమ్యూనిస్ట్‌ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. అందుకే రెండో లిస్ట్ ఆలస్యం అవుతున్నట్లు చెపుతున్నారు.

Read Also : KCR – Madan Mohan : కేసీఆర్‌పై ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్కడు.. ఎవరో తెలుసా ?

Exit mobile version