Site icon HashtagU Telugu

Congress Candidates : ముగిసిన కాంగ్రెస్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు! కొన్ని చోట్ల కుటుంబ స‌మేతంగా అప్లై!!

Congress Groups

Revanth Gandhi Bhavan Copy

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు (Congress candidates) క్యూ క‌ట్టారు. ద‌ర‌ఖాస్తులు వెల్లువ‌గా వ‌చ్చాయి. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి డ‌జ‌న్ల కొద్దీ ద‌ర‌ఖాస్తులు రావ‌డం కాంగ్రెస్ పార్టీకి స‌వాల్ గా మారింది. వారసుల‌తో క‌లిసి సీనియ‌ర్లు ద‌ర‌ఖాస్తుల‌ను దాఖ‌లు చేయ‌డం విచిత్రం. కొంద‌రు వార‌సుల‌తో ద‌ర‌ఖాస్తులు చేయించారు. మ‌రికొంద‌రు స‌కుటుంబ స‌మేతంగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. టిక్కెట్ల‌ను ఆశిస్తోన్న వాళ్ల సంఖ్య పెర‌గ‌డంతో గాంధీభ‌వ‌న్ ర‌ద్దీగా మారింది. గ‌డువు ఈనెల 25వ తేదీతో ముగిసింది. సుమారు 1000 పైగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. కేవ‌లం వారం రోజుల వ్య‌వ‌ధిలోనే 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పెద్ద సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు రావ‌డం ఆ పార్టీకి ఉన్న క్రేజ్ ను సూచిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు (Congress candidates)

చివరి రోజు కావడంతో భారీగా ఆశావహులు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు అభ్య‌ర్థులు  (Congress candidates)పోటెత్తారు. గాంధీభ‌వ‌న్ వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం గురువారం వ‌ర‌కు 700 పైచిలుకు దరఖాస్తులు వ‌చ్చాయి. చివ‌రి రోజు వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం చేసుకుని ద‌ర‌ఖాస్తులు చేసుకున్న వాళ్లు అనేకులు. మొత్తంగా వెయ్యికి చేరే అవకాశం కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో 10 నుంచి 15 దాకా అప్లికేషన్లు రావ‌డం గ‌మ‌నార్హం

మరోవైపు ఒక్కో నేత ఒకటి కంటే ఎక్కువ స్థానాలకు దరఖాస్తు (Congress candidates) చేసుకుంటున్నారు. ఓకే కుటుంబ నుంచి వేర్వేరుగా దరఖాస్తు చేస్తున్నారు. నాగార్జున సాగర్ టికెట్ కోసం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుకులు రఘువీర్‌‌ రెడ్డి, జైవీర్ రెడ్డి దరఖాస్తు చేశారు. మిర్యాలగూడ టికెట్ కోసం రఘువీర్ రెడ్డి అప్లికేషన్ దాఖలు ప‌రిచారు. కరీంనగర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ సోదరుడు రంగారావు కుమార్తె రమ్యారావు, ఆమె కుమారుడు రితేశ్ రావు దరఖాస్తు పెట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అంజన్ కుమార్ యాదవ్, ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

జానారెడ్డి కొడుకులు రఘువీర్‌‌ రెడ్డి, జైవీర్ రెడ్డి దరఖాస్తు

ద‌ర‌ఖాస్తుల గడువు శుక్ర‌వారంతో ముగిసిన‌ప్ప‌టికీ ఇత‌ర పార్టీల నుంచి లీడ‌ర్ల‌ను కాంగ్రెస్ పార్టీ ఆక‌ర్షిస్తోంది. గడువు ముగిసిన త‌రువాత ద‌ర‌ఖాస్తులు చేసుకోకూడదా? అంటే అధిష్టానం విచ‌క్ష‌ణాధికారాన్ని ఉప‌యోగించి ఏమైనా చేయొచ్చ‌ని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో స‌హా సీనియ‌ర్లు అంద‌రూ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈసారి కొత్త నాయ‌క‌త్వం వ‌స్తుంద‌ని రాహుల్ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ద‌ర‌ఖాస్తుల సంఖ్య పెరిగింది. యువ‌కులు, ఔత్సాహికులు కూడా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం (Congress candidates) ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

Also Read : Congress List : కేసీఆర్ ఎత్తుకు రేవంత్ పైఎత్తు! నెలాఖ‌రులోగా 119 అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌?

కాంగ్రెస్ పార్టీ అంద‌రికీ ఒకే పాల‌సీని పెట్టింది. చ‌త్తీస్ గ‌డ్ లోని రాయ్ పూర్ డిక్ల‌రేష‌న్ ప్ర‌కారం 70 ప్ల‌స్ వ‌య‌స్సు వాళ్ల‌కు టిక్కెట్లు ఉండ‌వు. ఒక కుటుంబంలో ఒక‌రికి మాత్ర‌మే టిక్కెట్ ఇవ్వాల‌ని తీర్మానం జ‌రిగింది. వ‌రుస‌గా మూడుసార్లు ఓడిపోయిన వాళ్ల‌కు టిక్కెట్ నిరాకరించాల‌ని కూడా నిర్ణ‌యం తీసుకున్నారు. ఒక‌రు ఒక చోట నుంచి మాత్ర‌మే పోటీ చేయాలి. ఇలా తీసుకున్న నిర్ణ‌యాలు అన్నీ అమ‌లు చేస్తే కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వాళ్ల‌కు పోటీ చేసే అవ‌కాశం రావ‌చ్చ‌ని ఆశావ‌హుల చిగురాశ‌. పైగా పీసీసీ రేవంత్ రెడ్డి ఎవ‌రికైనా స‌ర్వేల ప్ర‌కారం మాత్ర‌మే టిక్కెట్ అంటూ ప్ర‌క‌టించారు.

Also Read : Congress BC Fight : రేవంత్ పై బీసీల తిరుగుబాటు, ఆర‌ని అసంతృప్తి జ్వాల‌

ప్ర‌జ‌ల్లో ఉండే నాయ‌కుల‌కు మాత్రమే ఈసారి టిక్కెట్ వ‌స్తుంద‌ని అధిష్టానం ఇప్ప‌టికే సంకేతాలు ఇచ్చింది. మూడు మార్గాల ద్వారా స‌ర్వేల‌ను సేక‌రించింది. గెలుపు అవ‌కాశం ఉన్న వాళ్ల‌కు మాత్ర‌మే టిక్కెట్ల‌ను ఇవ్వ‌డానికి అధిష్టానం సిద్ధంగా ఉంది. క‌ర్ణాట‌క‌లోనూ కాస్తంత క‌ఠినంగా అధిష్టానం వ్య‌వ‌హ‌రించింది. అందుకే, అక్క‌డ సానుకూల ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని ఏఐసీసీ భావిస్తోంది. తెలంగాణాలోనూ సీనియ‌ర్లు, ఇత‌ర‌త్రా మార్గాల ద్వారా లాబీయింగ్ చేసినప్ప‌టికీ స‌ర్వేల్లో ముందున్న వాళ్ల‌కు మాత్రమే అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేస్తార‌ని రేవంత్ రెడ్డి ఇటీవ‌ల ప్ర‌కటించారు. దీంతో ఆశావ‌హుల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది.