Site icon HashtagU Telugu

TS Elections: పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ, అందరూ లీడింగే!

Congress List

Congress List

TS Elections: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ మేరకు పోస్టల్ బ్యాలట్ లెక్కింపు షురూ అయ్యింది. ఈ నేపథ్యంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందుంజలో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు.. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా లీడ్ లో ఉన్నారు. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా, నల్గొండ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజలో ఉన్నారు. ఇతర జిల్లాలో మొదలైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీనే ముందుండటమ గమనార్హం.

కొడంగల్ లో రేవంత్ రెడ్డి ముందంజ

మంచిర్యాల , బెల్లంపల్లి లో కాంగ్రెస్ ముందంజ

వేములవాడ కాంగ్రెస్ ముందంజ

ఖైరతాబాద్ లో విజయారెడ్డి ముందంజలో ఉన్నారు

వికారాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ముందు ఉన్నాడు

నిజామాబాద్ లోని 5 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ ఉండటం విశేషం.

మధిరలో బట్టి విక్రమార్క ముందంజ

ఖమ్మంలో తుమ్మల ముందంజలో ఉన్నారు

భువనగిరి నియోజకవర్గం లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి 400 లీడ్

అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు.

ఖమ్మం, నల్లగొండలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ముందువరుసలో  ఉంది.

Exit mobile version