Site icon HashtagU Telugu

Munugode by poll : ఇడికుడలో ఓటు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి..!!

Palvai

Palvai

మునుగోడులో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. కాసేపటిక్రితం అధికారటీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటును వినియోగించుకున్నారు. తన భార్యతో కలిసి స్వగ్రామం అయిన లింగంవారి గూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి తన స్వగ్రామం అయిన ఇడికుడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆగస్టు 8న మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.