Site icon HashtagU Telugu

Telangana : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..కరెంట్ కోతలు మొదలయ్యాయి – కేసీఆర్

KCR Entered Social Media

Kcr (2)

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల ప్రచారం ముంగిపు సందర్భంలో బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఆయన కాంగ్రెస్ , బిజెపి పార్టీల ఫై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది..కరెంట్ కోతలు మొదలయ్యాయి అని తెలిపారు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి కరెంటు చాలా ముఖ్యమని అన్నారు. పిండిగిర్నీ నడిపే వ్యక్తి నుంచి హెలికాప్టర్‌లు తయారు చేసే కంపెనీ వరకు కరెంటు కోతలతో తీవ్రంగా ప్రభావితమవుతాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

‘కరెంటును ఎందుకు దెబ్బ తీస్తున్నారో నాకు అర్థం కావడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసారు. ఏం కొరత లేదు. సింగరేణి మనది. బొగ్గు కొరత లేదు, నీళ్ల కొరత లేదు. మనుషుల కొరత లేదు. అదే ఉద్యోగస్తులు. ఎందుకు నడపలేదు కరెంటును..? ఏం సమాధానం చెప్తరు ప్రజలకు. అదే ఆగ్రహం ఉంది ప్రజల్లో. నేనదే ప్రశ్న అడిగిన నా ప్రసంగాల్లో. కేసీఆర్‌ పక్కకు జరగంగనే కట్కా బంద్‌ చేసినట్టే కరెంటు ఎక్కడికి పోయింది..? తొమ్మిదేళ్లు జరిగిందిగా.. ఇప్పుడు వీళ్లు కొత్తగా చేసేదేముంది..? ఉన్నదున్నట్టు నడిపిస్తే అయిపోయేది. వాళ్లు అతిచేశారు. అతికి పోయి ఈ పరిస్థితికి తెచ్చిండ్రు’ అని కేసీఆర్‌ విమర్శించారు.

నేను సీఎం అయ్యాక తెలంగాణ ధ‌నిక రాష్ట్రం అని చెప్పి నిరూపించాను. ధ‌నిక రాష్ట్ర‌మ‌ని చెబుతూ ఆ దిశ‌గా ప‌య‌నిస్తూ అద్భుత విజ‌యం సాధించాను. కానీ ఈ ప్రభుత్వం రాగానే అనేక సమస్యలు మొదలు అయ్యాయి. ఈ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క ముందు అనేక వ్య‌వ‌స్థ‌లు చాలా చ‌క్క‌గా ప‌ని చేశాయ‌ని..కానీ ఇప్పుడు ఏ వ్యవస్థ కూడా పనిచేయడం లేదని అన్నారు. ఒక‌ పాల‌సీ లేకుండా, రైతులు, ఇండ‌స్ట్రీ, ప‌వ‌ర్, ఇరిగేష‌న్ సెక్టార్‌ను ప‌క్క‌న పెట్టి అమూల్య‌మైన స‌మ‌యాన్ని చిల్లర రాజ‌కీయాల కోసం ఈ ప్రభుత్వం వెస్ట్ చేస్తుందని మండిపడ్డారు.

రాష్ట్రం దివాళా తీసింద‌ని ఏ పిచ్చి ముఖ్య‌మంత్రి కూడా చెప్పాడు. అది స్టేట్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తుంది. రాష్ట్రానికి దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌కొడుతోంది. రాక్ష‌స ఆనంద‌రం కోసం, సంతోషం కోసం తాత్కాలికంగా ఆ నిమిషం వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డొచ్చు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఆశించే దృష్ట్యా రాష్ట్రం బాగుంద‌ని చెప్పాలి. కానీ ఈ సీఎం మాత్రం పరువు తీస్తున్నాడని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : Allu Arjun : అల్లు అర్జున్ నంద్యాల పర్యటన.. వైసీపీపై చంద్రబాబు విమర్శలు..