TS Polls Results 2023 : తెలంగాణ కాంగ్రెస్ సీఎం కోసం “ప్రజా పాలన భవన్” సిద్ధం – కాంగ్రెస్ ట్వీట్

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోసం "ప్రజా పాలన భవన్" సిద్ధమవుతోందని

Published By: HashtagU Telugu Desk
Cng Brs

Cng Brs

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇంకా మిషన్ లో ఉండగానే కాంగ్రెస్ (Congress) – బిఆర్ఎస్ (BRS) పార్టీలు అప్పుడే ఫలితాల్లో విజయం సాధించినట్లు వరుస ట్వీట్స్ పెడుతున్నాయి. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాదించబోతుందని చెప్పినప్పటికీ..అసలు రిజల్ట్స్ లలో మీమే గెలవబోతున్నామని బిఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇదే తరుణంలో తాజాగా బిఆర్ఎస్ ఎన్నికల్లో గెలువబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అందుకే ప్రగతి భవన్‌ను ముస్తాబు చేస్తున్నామని చెపుతూ.. ప్రగతి భవన్‌కు కొత్త రంగులు వేసే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

దీనిపై కాంగ్రెస్ శ్రేణులు స్పందించాయి. తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ సైడే ఉన్నారని, అందుకు ఎగ్జిట్ పోల్స్‌ ఏ ఊదాహరణ అని కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తూ…తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోసం “ప్రజా పాలన భవన్” సిద్ధమవుతోందని కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఇచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రస్తుత ప్రగతి భవన్‌కు రంగులు వేస్తున్నారని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ “ప్రజా పాలన భవన్” నుంచి ప్రజలు కోరుకున్న “ప్రజా తెలంగాణ” పాలన చేస్తారని కౌంటర్ ఇచ్చారు. ఇలా ఇరువురి పోస్టులు చూసి సామాన్య ప్రజలు ఏంటి మాకు ఈ రచ్చ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : KA Paul: తెలంగాణకు నేనే ముఖ్యమంత్రి కాబోతున్నా: కేఏ పాల్

  Last Updated: 02 Dec 2023, 07:57 PM IST