కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాల నేతలు(Congress BC Fight)రగిలిపోతున్నారు. అధిష్టానం వద్ద పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. పార్టీలో అన్యాయం జరుగుతుందని ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే వద్ద పంచాయతీ పెట్టారు. రాబోవు రోజుల్లో `రెడ్డి` సామాజికవర్గం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం దిశగా వెళుతుందని ఆవేదన చెందారు. ప్రత్యేకించి పీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షుల నియామకంలో జరిగిన అన్యాయాన్ని లేవనెత్తారు. తాజాగా జనగాం జిల్లా డీసీసీ విషయంలో జరిగిన అంశాన్ని ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాల నేతలు(Congress BC Fight)
మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్యయ్య జనగాం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తొలి నుంచి కాంగ్రెస్ వాదిగా ఉంటూ వివాదరహితునిగా రాజకీయాలను నడుపుతున్నారు. ఇటీవల అక్కడ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధిపత్యం పెరిగింది. దానికి కారణం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ పొన్నాల వర్గీయుల ఆరోపణ. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా `రెడ్డి` ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందని డేటాను బయట పెట్టారు. ఇటీవల జరిగిన నియామకాల్లో జరిగిన అన్యాయంపై గాంధీభవన్ వేదికగా (Congress BC Fight) నిరసన వ్యక్తపరిచారు. ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీని ఎన్నికల వేళ ఇరుకునపెట్టే అంశంగా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా `రెడ్డి` ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీలో
కాంగ్రెస్ పార్టీ తెలంగాణను 35 జిల్లాలుగా విభజించింది. ఒక్కో జిల్లాకు ఒకర్ని డీసీసీ అధ్యక్షుడ్ని ఇటీవల (Congress BC Fight) నియమించింది. మొత్తం 35 మందిలో 22 మంది డీసీసీ ప్రెసిడెంట్లు ఉండగా కేవలం 6 జిల్లాలను మాత్రమే బీసీలను పరిమితం చేయడం జరిగింది. అంతేకాదు 22 మంది ఓసీ నాయకుల్లో 15 జిల్లాల అధ్యక్షులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లీడర్లు. ఇక వెలమ 4, వైశ్య, ఠాకూర్, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరే ఉన్నారు. నియామకాలను చూస్తే ఓసీలు 22, బీసీలు 6, ఎస్సీలు 3, ఎస్టీలు 2, మైనార్టీల తరఫున ఇద్దరు మాత్రమే ఉండడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణను 35 జిల్లాలుగా
రాబోవు రోజుల్లో `రెడ్డి` సామాజికవర్గానికి రాజ్యాధికారం కావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. ఆ సామాజికవర్గంకు అన్ని పార్టీలు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ఆ మేరకు గత ఏడాది కార్టీక సమారాధన సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. ఆ రోజు నుంచి మిగిలిన సామాజికవర్గాలు ఆయన ఆలోచన వైఖరిని తప్పుబడుతున్నారు. అయినప్పటికీ డీసీసీల నియామకం విషయంలో రెడ్డి సామాజికవర్గానికి 50శాతంపైగా ప్రాతినిధ్యం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం నుంచి (Congress BC Fight) మరలినట్టు అయింది.
Also Read : Congress to BRS : బీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి? కాంగ్రెస్ కు జలక్!
సామాజిక సమతుల్యతను పాటించే పార్టీల్లో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుంది. ఆ పార్టీలో అన్ని సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్థానం ఎక్కువగా ఉంటుందని తొలి నుంచి ఒక నమ్మకం. ఆ మేరకు అధిష్టానం కూడా ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా బీసీలు ఉంటారు. అనధికారిక లెక్కల ప్రకారం 55శాతం పైగా బీసీలు ఉంటారని అంచనా. ఆ మేరకు రాజకీయాల్లో నాయకత్వం ఉండాలని ఆ సామాజికవర్గం కోరుకుంటోంది. ఇక ఎస్సీ, ఎస్టీలు కూడా దామాషా ప్రకారం సంస్థాగత నియామకాలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read : Revanth Reddy Missing Posters : “రేవంత్ మిస్సింగ్” పోస్టర్ల కలకలం.. బీఆర్ఎస్ పనే అంటున్న కాంగ్రెస్
వెనుకబడిన వర్గాలకు చెందిన అగ్ర నాయకులుగా మధుయాష్కీ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు. పీసీసీ కమిటీలోనూ పెద్దగా బీసీలకు ప్రాధాన్యం లేకుండా చేశారు. ప్రచార కమిటీ చైర్మన్ గా మధుయాష్కీ ఉన్నప్పటికీ కో చైర్మన్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించారు. ఇక ఎన్నికల కమిటీలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కానీ, బీసీ నాయలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో అగ్రనేతలతో పాటు ఇప్పుడు డీసీసీల నియామకాల్లో జరిగిన అన్యాయంపై ఆ సామాజికవర్గం రగలిపోతోంది. రాబోవు ఎన్నికల్లో బీసీల్లోని అసంతృప్తి కాంగ్రెస్ పార్టీని ఎటు వైపు తీసుకెళుతుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.