KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధమని విమర్శించారు. దీనిపై ఆ పార్టీకి స్పష్టత లేదన్నారు. మంగళవారం సమర్పించిన డేటాపై ప్రభుత్వానికి అవగాహన లేదని పేర్కొన్నారు. నిన్నటి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టం చేసింది. ఏడాది కాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసింది. అసెంబ్లీలో సమర్పించిన డేటాపై రాష్ట్ర సర్కారుకు ఏమాత్రం క్లారిటీ లేదు.
Read Also: Kumbh Mela : త్రివేణీ సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం..
కాంగ్రెస్‌కు 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుని నెపాన్ని కేంద్రంపై నెడుతున్నారు. ఆ పార్టీ హామీలు, ప్రకటనలన్నీ రాజకీయ నాటకాలే అని రుజువైంది. రాహుల్ గాంధీ తన పేరును ఎన్నికల గాంధీగా మార్చుకోవాలి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం. ఈ సర్కారు నిబద్ధత వంద శాతం నకిలీ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
రిజర్వేషన్ల అంశంలో నిసిగ్గుగా కాంగ్రెస్ పార్టీ యూ టర్న్ తీసుకుందని.. కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టి తప్పించుకోవాలని పన్నాగం వేసిందని.. దీంతో మీరు ఎంత నిబద్ధతతో ఉన్నారో స్పష్టంగా తెలియజేస్తుందని ఆరోపించారు. ఇక రాహుల్ గాంధీ హామీలు, చెప్పిన వాగ్ధానాలు, చేసిన ప్రకటనలు, అన్నీ బూటకం తప్ప మరేమీ కాదని మరోసారి రుజువు అయిందని దుయ్యబట్టారు.