Harish Rao: కాంగ్రెస్ ఆదివారం ప్రకటించిన ఆరు హామీలపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పందించారు. కాంగ్రెస్ అబద్ధాలతో ఇతరులపై నిందలు వేయడం, చరిత్రను వక్రీకరించడం తప్ప మరొకటి కాదని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ని పట్టించుకోవద్దని, వారిచ్చిన హామీలకు ఓట్లు పడతాయన్న గ్యారెంటీ లేదని వ్యంగ్యంగా మాట్లాడారు.
రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలనే మార్చేసి కొత్తగా రూపొందించినట్టు చేస్తున్నారని, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు కాబోవని, అవాస్తమైన వాగ్దానాలని మంత్రి హరీష్ స్పష్టం చేశారు. కర్నాటకలో కాంగ్రెస్ హామీలను అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్న హరీశ్‌రావు.. ఇతర రాష్ట్రాల్లో రైతుబంధు, రైతుబీమా అమలుకు సిద్ధమా అని సూటిగా ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీలు ఒకదానికొకటి మద్దతిస్తాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు ఘాటుగా స్పందిస్తూ.. బీఆర్‌ఎస్ ఎన్నికల్లో బీజేపీకి ఎప్పుడూ మద్దతివ్వలేదని గుర్తు చేశారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ నాయకుడూ ఈడీ దాడులను ఎదుర్కోలేదు. బీఆర్‌ఎస్ నేతలపై మాత్రమే ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసు, రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీల్లో అక్రమాలపై బీజేపీ ప్రభుత్వం ఎందుకు తదుపరి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో వేల కుంభకోణాలు జరిగాయని ఆరోపించిన హరీశ్‌రావు.. దేశంలో స్కామ్ కల్చర్‌ను కాంగ్రెస్ ప్రవేశపెట్టిందన్నారు. వేలాది మంది యువకులు తమ ప్రాణాలను త్యాగం చేసి తెలంగాణ సాధించుకున్నారు. ఇతరుల దయాదాక్షిణ్యాలతో తెలంగాణ ఏర్పడలేదు అని అన్నారు.
Also Read: AP Special Status: తెరపైకి ఏపీ ప్రత్యేక హోదా