Site icon HashtagU Telugu

Congress Candidates List : అక్టోబర్ 10న కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన..?

Congress List

Congress List

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Election 2023) సమయం దగ్గర పడుతుండడం తో ప్రతి పక్ష పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ అభ్యర్థులను (Candidates List) త్వరగా ప్రకటించి ప్రచారానికి సిద్ధం చేయాలనీ చూస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ (BRS) తమ అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి అభ్యర్థులను పంపించగా..మిగతా పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అక్టోబర్ 10 న కాంగ్రెస్ పార్టీ (Congress Party) తమ అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

మరి ఫస్ట్ లిస్ట్ లో ఎంతమందిని ప్రకటిస్తుందనేది తెలియాల్సి ఉంది. గతంలో 32 మందిని ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మరి ఆ 32 మందినే అధికారికంగా ప్రకటిస్తుందా..? లేక మరికొంతమంది తో కూడిన లిస్ట్ ను ప్రకటిస్తుందా అనేది చూడాలి. రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ “స్క్రీనింగ్ కమిటీ” సమావేశం జరుగనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ “వార్ రూమ్”లో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేస్తారని సమాచారం. ఫైనల్ చేసిన అభ్యర్థులనే ఈ నెల 10 న ప్రకటిస్తారు కావొచ్చు. ప్రస్తుతం తెలంగాణ లో కాంగ్రెస్ జోష్ బాగా పెరిగింది. బిఆర్ఎస్ లో టికెట్ రాని నేతలంతా కాంగ్రెస్ లో చేరారు..ఇంకా చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరి చేరిక కూడా కాంగ్రెస్ కు బలం పెంచినట్లు అయ్యింది.

Read Also : Australia vs India: వన్డే ఫార్మాట్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌ల గణాంకాలు ఇవే.. భారత్ పై ఆస్ట్రేలియాదే పైచేయి..!