తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections ) ఆరు గ్యారెంటీ హామీలు (Six Guarantees) ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల (Lok Sabha Polls) సమయం దగ్గర పడుతున్న వేళ ‘స్పెషల్ మేనిఫెస్టో’ (‘Special Manifesto’) ను ప్రకటించింది కాంగ్రెస్. గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణకు ప్రత్యేక హామీలు పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఈ కింది విధంగా ఉన్నాయి హామీలు.
కాజీపేటలో రైల్వే కోచ్
బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా
హైదరాబాద్ లో నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు
4 కొత్త సైనిక స్కూళ్లు
నేషనల్ ఏవియేషన్ యూనివర్శిటీ ఏర్పాటు
హైదరాబాద్ కు ఐటీఐఆర్ పాజెక్టు పునఃప్రారంభం
హైదరాబాద్ – విజయవాడ హైవే పక్కనుంచి ర్యాపిడ్ రైల్వే వ్యవస్థ
ప్రతి ఇంటికి సౌరశక్తి
రామగుండం – మణుగూరు ప్రత్యేక రైల్వే లైన్
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్ లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఏర్పాటు
రాష్ట్రంలో మరిన్ని కేంద్రీయ విద్యాలయాలు
నవోదయ విద్యాలయాలు
జాతీయ క్రీడ విశ్వవిద్యాలయం ఏర్పాటు
నూతన ఎయిర్ పోర్టుల కట్టడాలు
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)ఏర్పాటు
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (IIFT) ఏర్పాటు
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) క్యాంపస్ ఏర్పాటు
ఐసీఎంఆర్, 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ సర్పంచులకు బదిలీ అయ్యేలా చేస్తామని హామీ
హైదరాబాద్ – బెంగళూరు ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్
హైదరాబాద్ – నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్
హైదరాబాద్ – వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్
హైదరాబాద్ – నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్
సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. అలాగే ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్ మెంట్ హబ్
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా, డ్రై పోర్టు ఏర్పాటు
హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చింది.
గాంధీ భవన్ లో జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మేనిఫెస్టో కన్వీనర్ ప్రో. జానయ్య, సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Also : MLC Dande Vithal: బిగ్ షాక్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు