Site icon HashtagU Telugu

Congres -BRS : జగిత్యాలలో కాంగ్రెస్- బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ

Clash Beetween

Clash Beetween

జగిత్యాలలో కాంగ్రెస్- బీఆర్ఎస్ (Congres -BRS) నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. తహసీల్దార్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఇరు వర్గాలను మధ్య గొడవ తలెత్తడం తో అక్కడి కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శనివారం ఉదయం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే, విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జగిత్యాల భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ సైతం హస్తం పార్టీ చెప్పిన తులం బంగారం హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి తోపులాటకు దారితీసింది. దీంతో కొద్ది సేపు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ఈ క్రమంలోనే జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddy), అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ కలగజేసుకొని వారికి సర్దిచెప్పడం తో అంత శాంతించారు.

Read Also :Telangana Cabinet : ఈనెల 11న తెలంగాణ కేబినెట్ సమావేశం