Telangana Awaaz Survey : ఆ రెండు పార్టీల మధ్యే టఫ్ ఫైట్.. సంచలన సర్వే రిపోర్ట్

Telangana Awaaz Survey : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పార్టీల బలాబలాలపై ప్రజాభిప్రాయం ఆధారంగా ‘తెలంగాణ ఆవాజ్’ సంస్థ తన వీక్లీ సర్వే రిపోర్టును రిలీజ్  చేసింది.

Published By: HashtagU Telugu Desk
Ts Awaaz

Ts Awaaz

Telangana Awaaz Survey : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పార్టీల బలాబలాలపై ప్రజాభిప్రాయం ఆధారంగా ‘తెలంగాణ ఆవాజ్’ సంస్థ తన వీక్లీ సర్వే రిపోర్టును రిలీజ్  చేసింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి  మరో వారం రోజుల టైం ఉందనగా.. ఈ సర్వే నివేదిక వెలువడటం సంచలనం క్రియేట్ చేసింది. ఇటీవల క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన ‘తెలంగాణ ఆవాజ్’ టీమ్..  ప్రజల ఓపీనియన్‌ను కూడగట్టి  ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది. కాంగ్రెస్‌కు 29.8 శాతం, బీజేపీకి 28.6 శాతం, బీఆర్ఎస్‌కు 24.3 శాతం, తటస్థులకు 12.3 శాతం, ఇతరులకు 4.9 శాతం ఓట్లు వస్తాయని సర్వే నివేదిక అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 6 నుంచి 8 లోక్‌సభ సీట్లు, బీజేపీకి 5 నుంచి 7 సీట్లు, బీఆర్ఎస్‌కు 2 నుంచి 4 సీట్లు, ఇతరులకు ఒక సీటు వచ్చే అవకాశం ఉందని సర్వే నివేదిక కుండబద్దలు కొట్టింది. ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతలకు ఈ సర్వే షాక్‌ ఇచ్చేలా ఉంది. ఇటీవల పలు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలలోనూ ఇదే తరహా ఫలితాలు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join

ఇటీవల ‘సీఎస్‌డీఎస్‌ – లోక్‌నీతి’ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో(Telangana Awaaz Survey) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని ప్రకారం.. మన దేశంలోని ఓటర్లు ఓటు వేయడానికి ప్రధాన ప్రాతిపదికలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి.బీజేపీ ఆశలు పెట్టుకున్న రామమందిరం అంశానికి ఓటర్లు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఈ సర్వే తేల్చింది. అవినీతి అంశాన్ని కూడా జనం అంతగా పట్టించుకోవటం లేదని పేర్కొంది. నిరుద్యోగం ముఖ్యమైన అంశమని 11 శాతం మందే చెప్పారు. ప్రస్తుత సర్వేలో ఈ సంఖ్య 27 శాతానికి పెరిగింది. తమకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని.. సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది స్పష్టం చేశారు. చదువుకున్న యువతీ యువకులలో చాలామంది నిరుద్యోగం తీవ్రమైన సమస్య అని చెప్పగా, అంతగా చదువుకోని వ్యక్తులు ధరల పెరుగుదలను ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 8 శాతం మందే రామమందిరం, అవినీతి అంశాలను ఓటు వేయటానికి అత్యంత ముఖ్యమైన విషయాలుగా పేర్కొన్నారని ‘సీఎస్‌డీఎస్‌ – లోక్‌నీతి’ తెలిపింది.

Also Read : Kavitha : నేటి నుంచి కవితను ఇంటరాగేట్ చేయనున్న సీబీఐ

  Last Updated: 13 Apr 2024, 01:20 PM IST