Telangana: కాంగ్రెస్, బీజేపీ విడదీయరాని కవలలు

కాంగ్రెస్, బీజేపీలు విడదీయరాని కవలలని, రెండు పార్టీలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నాయని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.

Telangana: కాంగ్రెస్, బీజేపీలు విడదీయరాని కవలలని, రెండు పార్టీలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నాయని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీలు దూకుడు పెంచాయి. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో ఆయా రాజకీయ లీడర్లు మాటల తూటాలు పేల్చుతున్నారు. తెలంగాణలో ప్రముఖంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య పోరు నడుస్తుంది. ఈ మూడు పార్టీలకంటే మజ్లీస్ సపోర్టింగ్ పార్టీగా పేరుగాంచింది. అధికార పార్టీ బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ వస్తుంది.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జరిగిన ఎంఐఎం పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ వివాదంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కోరారు.

నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కేసీఆర్ కి మద్దతు ఇవ్వాలని ఎంఐఎం కార్యకర్తలని సదుద్దీన్ ఒవైసీ కోరారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోటనే అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి. నాల్గవ పార్టీ మజ్లిస్. పవర్ మా చేతుల్లోనే ఉందంటూ ఒవైసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అమిత్ తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానన్న ప్రకటనపై ఒవైసి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also Read: Skin : మీ చర్మం నిగనిగలాడాలంటే..డాన్స్ చేయాల్సిందే..