Site icon HashtagU Telugu

T Congress : కాంగ్రెస్ కు ఈ 3 రోజులు చాల కీలకం..కేసీఆర్ ఏమైనా చేయొచ్చు..

t congress campaign

t congress campaign

కాంగ్రెస్ నెల రోజుల ప్రచారం ఒకెత్తు..ఈ మూడు రోజులు ఒకెత్తు..ఎందుకంటే అవతల పక్క ఉన్న గులాబీ బాస్ ను ఏమాత్రం తక్కువ అంచనా వెయ్యొద్దు..చివరి నిమిషంలో ఏమైనా చేసే సత్తా ఉంది…ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడంలో చాణుక్యుడు..అందుకు ఈ మూడు రోజులు పార్టీ చాల కీలకమని కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ కి సూచించింది.

రేపటి తో ఎన్నికల ప్రచారానికి శుభం కార్డు పడబోతోంది. మధ్యలో ఒక్క రోజు ఉంది. సో ఉన్న ఈ రెండు రోజులు చాల కీలకం కాబోతున్నాయి. అందుకే కాంగ్రెస్ మరింత దృష్టి పెడుతుంది. బీఆర్ఎస్ లీడర్లకు పోలీసులు, అధికారులు సహకారం అందించే అవకాశం ఉందనీ.. అప్రమత్తంగా ఉండాలని సునీల్ కనుగోలు టీమ్ కాంగ్రెస్ అభ్యర్థులను హెచ్చరిస్తోంది.

ఇప్పటి వరకు అందించిన ప్రతి పోల్ సర్వే కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో 65 – 75 సీట్లు రావడం పక్క అని తేల్చేసింది. ఇంకొన్ని సర్వేలు ఏకంగా 80 సీట్లు రావడం గ్యారెంటీ అని చెప్పుకొచ్చాయి. సో ఈ క్రమంలో బిఆర్ఎస్ నేతలు ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవచ్చని సంకేతాలు అందడంతో బీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేయాలి వంటి అంశాలపై కాంగ్రెస్ అభ్యర్థులకు సునీల్ టీమ్ సూచనలు ఇస్తోంది. “ఈ మూడు రోజులు అభ్యర్థులు సొంతంగా పనిచేసుకుంటూనే.. బీఆర్ఎస్ కదలికలపైనా కన్నేసి ఉంచాలి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. దానికి తగ్గట్టుగా కౌంటర్ ప్లాన్ వేసుకోవాలి. మీ టీమ్స్‌ని అప్రమత్తంగా ఉంచుకోండి” అని కాంగ్రెస్ అభ్యర్థులకు చెబుతున్నారు.

టఫ్ ఫైట్ ఉన్న 25 నుంచి 30 స్థానాలపై సునీల్ కనుగోలు టీమ్ డైరెక్ట్‌గా నజర్ పెట్టింది. లోకల్ లీడర్లను డీల్ చేస్తూ వ్యూహాలు రెడీ చేస్తోంది. బీఆర్ఎస్‌కి ప్లస్ పాయింట్.. పోల్ మేనేజ్‌మెంటే కావడంతో.. కాంగ్రెస్ కూడా పక్కాగా దానిపైనే దృష్టిపెట్టింది. ప్రతి ఒక్క ఓటర్నీ పోలింగ్ కేంద్రానికి రప్పించేలా చూడాలని, గెలుస్తామనే అతి విశ్వాసంతో ఉండొద్దనీ.. చివరి వరకూ.. ఓటర్లను కలుసుకోవాలని చెప్పుకొచ్చింది. ఆలా చేసినప్పుడే గెలుపు మరింత అవుతుందని..ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన చేసిన కష్టం వృధా అవుతుందని హెచ్చరించింది. ఏ మూడు రోజులు తీవ్రంగా కష్టపడాలని..ఓటర్లను చేజార్చుకోవద్దని సూచించింది.

Read Also : Priyanka Gandhi : కేసీఆర్ మళ్లీ గెలిస్తే భూములు మాయం – ప్రియాంక గాంధీ