Site icon HashtagU Telugu

MLC Kavitha: మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: హైదరాబాద్: మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వస్తే కర్నాటక కరెంట్ కష్టాలు తెలంగాణలోనూ పునరావృతం అవుతాయనడానికి కర్నాటక రాష్ట్ర మంత్రి రామలింగ రెడ్డి చేసిన వ్యాఖ్యలే రుజువని స్పష్టం చేశారు. కర్నాటకలో కేవలం ఐదు గంటల పాటు మాత్రమే విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఆ రాష్ట్ర మంత్రి అంగీకరిస్తూ చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. 65 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రైతుల ఉసురు తీసుకుందని, ఇప్పుడు మరోసారి మభ్యపెట్టడానికి బయలుదేరిందని పేర్కొన్నారు. “కర్నాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నారు. తెలంగాణలో మూడు గంటల పార్టీ కరెంటు చాలని పీసీసీ అధ్యక్షుడు అన్నారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణలో మూడు గంటల కరెంటే వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు.” అని పేర్కొన్నారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ 24 గంటల పాటు రైతంగానికి ఉచిత విద్యుత్తును అందిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. రైతులపై ఉన్న ప్రేమ, చిత్తశుద్ధితో సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం రైతుల పట్ల ఎటువంటి మమకారం, చిత్తశుద్ధి లేదని స్పష్టం చేశారు.

Also Read: Sachin Tendulkar: సచిన్ విగ్రహం ఏంటీ ఇలా ఉంది.. సోషల్ మీడియాలో ట్రోలింగ్