Abhaya Hastham : ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న..అభయ హస్తం

తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం , ఆరోగ్య శ్రీ పెంపు వంటివి అమలు చేయగా..తాజాగా ప్రజా పాలనా కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించడం మొదలుపెట్టింది. ఈరోజు ( డిసెంబర్ 28 ) నుండి జనవరి 06 వరకు ప్రజల నుండి ఈ దరఖాస్తు పత్రాలను స్వీకరిస్తుంది. కాగా ఈ దరఖాస్తు విషయంలో ప్రజల్లో అనేక […]

Published By: HashtagU Telugu Desk
Abhaya Hastham Application

Abhaya Hastham Application

తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం , ఆరోగ్య శ్రీ పెంపు వంటివి అమలు చేయగా..తాజాగా ప్రజా పాలనా కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించడం మొదలుపెట్టింది. ఈరోజు ( డిసెంబర్ 28 ) నుండి జనవరి 06 వరకు ప్రజల నుండి ఈ దరఖాస్తు పత్రాలను స్వీకరిస్తుంది. కాగా ఈ దరఖాస్తు విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల దరఖాస్తుకు కుల , ఆదాయ సర్టిఫికెట్లు పెట్టాలా..వద్దా అని..దీనికి మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు.ప్రజా పాలన అభయ హస్తం ఆరు గ్యారెంటీలకు కుల, ఆదాయ సర్టిఫికెట్లు అవసరం లేదని తెలిపారు.

ఇదిలా ఉంటె మరికొన్ని అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి. ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తులను కంప్యూటర్‌లో అప్ లోడ్ చేస్తామని మంత్రులు, అధికారులు ప్రకటించినప్పటికీ అది చేయడం లేదు. ఎందుకని అడిగితే.. ఇంకా కంప్యూటరైజేషన్ సంబంధించి సాప్ట్ వేర్ అందుబాటులోకి రాలేదని తెలిపారు. దీంతో దరఖాస్తులను రిజిష్టర్‌లో నమోదు చేసుకున్నారు. సాఫ్ట్ వేర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో..? తెలియదని సిబ్బంది తెలియజేయడం అయోమాయానికి కారణమవుతోంది. దరఖాస్తులను కంప్యూటరైజేషషన్ చేస్తేనే.. సంబంధిత శాఖలకు ఆ దరఖాస్తులకు పంపి, త్వరితగతిన లబ్దిదారులను ఎంపిక చేసే వీలుంటుందని.. లేదంటే దరఖాస్తుల పరిశీలిన కష్టతరమవుతుందని అంత మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక గృహ జ్యోతి విషయంలో కూడా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఒక ఇంట్లో ఒకరి పేరు మీద విద్యుత్ మీటర్ ఉంటే.. మరో వ్యక్తి పేరిట గ్యాస్ సిలీండర్ ఉంటే ఎవరి పేరు గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవాలో.. అధికారులు క్లారీటి ఇవ్వడంలేదు. అభయ హస్తంలో అర్హులు ఎవరు..? అనర్హులు ఎవరన్నదికి ప్రభుత్వం స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వలేదు. దీంతో దరఖాస్తు దారులు డేటా స్వీకరణతో సరిపుచ్చుతారా..? పథకాల కోసం మరోసారి సంబంధిత పత్రాలను స్వీకరిస్తరా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రేషన్ కార్డు విషయానికి వస్తే..రేషన్ కార్డు లో పేర్లు ఉన్న వ్యక్తులు.. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలా..? కొత్త రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో.. అధికారులు స్పష్టంగా చెప్పడంలేదు. మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్లి దరఖాస్తు ఫారాన్ని తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రశీదు ఇవ్వడంలేదు. దీంతో రేషన్ కార్డు ఇస్తారా..? లేదా అనే అనుమానాలను జనం వ్యక్తంచేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెబుతూనే మరోవైపు ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుండడం ప్రజలకు ఏంచేయాలో అర్ధం కావడం లేదు.

అలాగే మహా లక్ష్మి పథకం విషయానికి వస్తే.. ఒక ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మహిళలు ఉంటే ఈ పధకానికి అందరూ దరఖాస్తు చేసుకోవాలా..? అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో దరఖాస్తు ఫారాన్ని నింపే విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ హడావిడిగా తీసుకొచ్చిన ఈ ప్రజా పాలనా ..ప్రజలను అయోమయానికి గురి చేస్తుంది తప్ప..ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో అనేది మాత్రం క్లారిటీ లేదు. ఏది ఏమైనప్పటికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ..హడావిడి తగ్గించి కాస్త నెమ్మదిగా అలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.

Read Also : AP Janmat Poll Survey : ఏపీలో మళ్లీ జగనే రాబోతున్నాడు..

  Last Updated: 28 Dec 2023, 08:01 PM IST