Site icon HashtagU Telugu

T Congress : తెలంగాణలో కాంగ్రెస్‌ హవా న‌డుస్తుంది : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్య‌ర్థి అజారుద్దీన్‌

Jai Congress

Jai Congress

తెలంగాణలో కాంగ్రెస్ హ‌వా న‌డుస్తోంద‌ని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్య‌ర్థి అజారుద్దీన్ తెలిపారు. తెలంగాణ‌లో బీజేపీ ప్రభావం అసలు లేదన్నారు. తెలంగాణ‌లో త‌మ‌ పార్టీ బలంగా ఉందని.. కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయ‌న తెలిపారు. గత 10 సంవత్సరాలలో, జూబ్లీహిల్స్ ప్రాంతంలో అభివృద్ధి ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌న్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని అది కూలిపోవ‌డానికి సిద‌ద్దంగా ఉంద‌న్నారు. ముఖ్యంగా పెద్ద ఏరియాగా భావించే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మరో నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. అజారుద్దీన్‌పై హెచ్‌సీఏ కేసులు ఉండ‌టంతో ఆయ‌న మాల్కాజ్‌గిరి కోర్టుని ఆశ్ర‌యించారు. ముందస్తు బెయిల్ కోసం ఆయ‌న కోర్టు ఆశ్ర‌యించ‌డంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయ‌న పోటీకి అడ్డు తొలిగిపోయింది. గ‌తంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్న స‌మ‌యంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆయ‌న‌పై ప‌లు కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే.

Also Read:  IT Raids On Ponguleti: పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు.. నేడే నామినేషన్‌..!?