Site icon HashtagU Telugu

Congress List Issue: కాంగ్రెస్ అసమ్మతి సెగ… కాంగ్రెస్ కార్యాలయం ధ్వంసం

Congress List Issue

Congress List Issue

Congress List Issue: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించడంలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే ఈ రోజు సగం మందికే సీఎం కేసీఆర్ బీఫామ్ లను అందించారు. మిగతా వారి పరిస్థితిపై స్పష్టత రాలేదు. ఇక ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ 55 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తులకి టికెట్లు దక్కాయి. మరోవైపు ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని ఉన్న వ్యక్తులకు పార్టీ టికెట్లు దక్కలేదు, మరీ ముఖ్యంగా సీనియర్ నాయకులు గీతారెడ్డి, నాగం లకు టికెట్లు దక్కలేదు. ఇటీవల జాయిన్ అయిన జూపల్లికి పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో అసమ్మతి బహిర్గతం అవుతుంది.

119 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ 55 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఎన్నో తర్జనభర్జనల తర్వాత ఈ రోజు అక్టోబర్ 15న కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో పలువురు నేతలకు నిరాశే ఎదురైంది. జహీరాబాద్‌ నుంచి డాక్టర్‌ గీతారెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి సహా సీనియర్‌ నేతలకు టిక్కెట్లు నిరాకరించారు.

ఎమ్మెల్యే చింతలపల్లి జగదీశ్వర్‌రావుకు కూడా టిక్కెట్టు నిరాకరించడంతో ఆయన మద్దతుదారులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తూ కొల్లాపూర్‌లోని పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్‌ చేసిన జూపల్లి కృష్ణారావుకు టికెట్‌ ఇవ్వడంతో తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జగదీశ్వర్ రావు మద్దతుదారులు కొల్లాపూర్ కాంగ్రెస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఫ్లెక్సీలు, కటౌట్లు, పార్టీ జెండాలను ధ్వంసం చేశారు.రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీ అభ్యున్నతికి ఐదేళ్లు కృషి చేసిన నాయకుడి కంటే కొత్త వ్యక్తికే ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమన్నారు. ఉప్పల్‌కు చెందిన రాగిడి లక్ష్మారెడ్డి తన పేరును జాబితాలో చేర్చకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. ఉప్పల్ టికెట్ మందుముల పరమేశ్వర్ రెడ్డికి దక్కింది.

Also Read: Monkey With Pig Kidney : పంది కిడ్నీతో రెండేళ్లుగా బతుకుతున్న కోతి.. ఆసక్తికర రీసెర్చ్ !