Ration Cards : రేషన్ కార్డుల ఎంపికలో గందరగోళం..

Ration Cards : గ్రామాల్లో ప్రభుత్వం అందించిన జాబితా ఆధారంగా సిబ్బంది సర్వే నిర్వహిస్తుండగా

Published By: HashtagU Telugu Desk
Ration Card Holders

Ration Card Holders

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రేషన్ కార్డుల (Ration Cards) లబ్ధిదారుల (Ration Card Holders) ఎంపిక విధానంపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వం అందించిన జాబితా ఆధారంగా సిబ్బంది సర్వే నిర్వహిస్తుండగా, అర్హత కలిగిన అనేక మంది జాబితాలో లేకపోవడం గమనార్హం. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన ప్రజలు తమ పేర్లు జాబితాలో లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Nara Lokesh : లోకేష్ నోటివెంట క్షమాపణలు ..ఎందుకంటే..!!

ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో సిబ్బంది అసమర్థంగా కనిపిస్తున్నారు. రేషన్ కార్డుల ఎంపికకు ప్రభుత్వం ఏ ప్రాతిపదికను అనుసరించిందని, ఈ జాబితా తయారీ క్రమంలో ఎటువంటి ప్రమాణాలు పాటించారనేది ప్రజల్లో అనుమానాలు కలుగజేస్తోంది. జాబితా తయారీలో కులగణన ఆధారంగా ఎంపిక జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజాపాలన కార్యక్రమాల్లో కార్డు కోసం నమోదు చేసిన వారి వివరాలు జాబితాలో లేకపోవడం ప్రభుత్వం విధానాలపై నమ్మకం కోల్పోయేలా చేస్తోంది. సర్వే నిర్వహించే సిబ్బందిపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రజల నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అర్హుల ఎంపికలో పారదర్శకత ఉండాలనే డిమాండ్‌ పెరుగుతోంది. కులగణన ఆధారంగా ఎంపిక జరిగిందనే ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, లబ్ధిదారుల ఎంపికలో సమర్థవంతమైన విధానాలు అనుసరించాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్ కార్డులు అందకపోవడంతో అనేక కుటుంబాలు తమ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రేషన్ కార్డుల వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి, పారదర్శకతతో అర్హుల ఎంపిక జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జాబితాలో తప్పులు సరిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి, బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  Last Updated: 17 Jan 2025, 08:38 PM IST