TSRTC : ఆర్టీసీ బస్సులో కండక్టర్‌ చేతివాటం..బస్సు ఎక్కకపోయినా 10 నుంచి 20 టికెట్లు ఇష్యూ

తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..వచ్చి రావడమే మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింది మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus in Women) సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. జీరో టికెట్ తో మహిళలు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణాలు చేస్తుండడం తో ఆర్టీసీ కి భారీగా లాభాలు అందుతున్నాయి. ఇదే క్రమంలో కొంతమంది బస్సు కండక్టర్‌లు తమ చేతివాటం చూపిస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌ నుంచి తాండూర్‌ వెళ్తున్న బస్సు (టీఎస్‌ 34 […]

Published By: HashtagU Telugu Desk
Conductor Showing Hand Gest

Conductor Showing Hand Gest

తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..వచ్చి రావడమే మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింది మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus in Women) సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. జీరో టికెట్ తో మహిళలు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణాలు చేస్తుండడం తో ఆర్టీసీ కి భారీగా లాభాలు అందుతున్నాయి. ఇదే క్రమంలో కొంతమంది బస్సు కండక్టర్‌లు తమ చేతివాటం చూపిస్తున్నారు.

తాజాగా మహబూబ్‌నగర్‌ నుంచి తాండూర్‌ వెళ్తున్న బస్సు (టీఎస్‌ 34 టీఏ 5189)లో ఉన్న కండక్టర్‌ ప్రతి స్టేజీ వద్ద మహిళా ప్రయాణికులు బస్సు ఎక్కకపోయినా 10 నుంచి 20 టికెట్లు ఇష్యూ చేశాడు. గండీడ్‌, జానంపల్లి ఇలా రెండు స్టేజీల వద్ద బస్సులో మహిళా ప్రయాణికులు తక్కువగా ఉండటంతో టిమ్‌ నుంచి టికెట్లు మాత్రం ప్రింట్‌ ఇచ్చాడు. తర్వాత వాటిని చించి బయట పడేశాడు. బస్సులో సగం కంటే ఎక్కువ సీట్లు ఖాళీ ఉన్నా టికెట్లు మాత్రం జారీ చేస్తూ మహిళలు ప్రయాణిస్తున్నట్టు లెక్కలు చూపిస్తున్నట్టు తెలుస్తున్నది.

We’re now on WhatsApp. Click to Join.

ఆర్టీసీ అధికారులకు సైతం ఇవే అనుమానాలు తలెత్తాయి. తమ డిపోలో 97 శాతం, 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌- సీట్ల భర్తీ నిష్పత్తి) నమోదవుతోందని కొందరు డిపో మేనేజర్లు ఇస్తున్న నివేదికలపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా ఓఆర్ ఎలా పెరిగిందని సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు జారీచేసే ‘జీరో’ టికెట్లపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. మరి ఇప్పుడు ఈ కండక్టర్ ఫై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం కండక్టర్ చేసిన చేతివాటం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Read Also : Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలపై గురిపెట్టిన అమిత్ షా

  Last Updated: 24 Dec 2023, 12:01 PM IST