లంచం అడిగిన అధికారులపై.. చెప్పుతో కొట్టిన కండక్టర్

ఆర్టీసీ అధికారిని ఓ కండక్టర్ నడిరోడ్డుపై చెప్పుతో కొట్టడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. బస్సులో అధికారులు చెకింగ్ చేసిన సమయంలో టికెట్ లేకుండా ఒక ప్రయాణికుడు దొరికాడు. అయితే ఆ ప్రయాణికుడికి ఫైన్ వేయకుండా, టికెట్ ఇవ్వని కండక్టర్‌పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆ చెకింగ్ అధికారి లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు, కండక్టర్ ఆ చెకింగ్ అధికారిపై దాడికి దిగారు. చెప్పుతో కొడుతూ అక్కడ పరిగెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు […]

Published By: HashtagU Telugu Desk
Tsrtc Conductor

Tsrtc Conductor

ఆర్టీసీ అధికారిని ఓ కండక్టర్ నడిరోడ్డుపై చెప్పుతో కొట్టడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. బస్సులో అధికారులు చెకింగ్ చేసిన సమయంలో టికెట్ లేకుండా ఒక ప్రయాణికుడు దొరికాడు. అయితే ఆ ప్రయాణికుడికి ఫైన్ వేయకుండా, టికెట్ ఇవ్వని కండక్టర్‌పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆ చెకింగ్ అధికారి లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు, కండక్టర్ ఆ చెకింగ్ అధికారిపై దాడికి దిగారు. చెప్పుతో కొడుతూ అక్కడ పరిగెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై బస్ కండక్టర్, బస్సులోని ప్రయాణికులు చెప్పుతో దాడి చేసిన సంఘటన తీవ్ర సంచలనంగా మారింది. టికెట్ తీసుకోని ప్రయాణికుడు, కండక్టర్‌పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు తనకు రూ.20 వేలు లంచం ఇవ్వాలంటూ చెకింగ్ అధికారి డిమాండ్ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఆ వివాదం కాస్తా మాటా మాటా పెరిగి దాడికి కారణం అయింది. చెకింగ్ అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు, కండక్టర్ అతడిని ఆర్టీసీ వాహనంలో నుంచి బయటికి లాగి మరీ దాడి చేశారు. చెకింగ్ అధికారిపై కండక్టర్, ప్రయాణికులు దాడి చేసిన వీడియోను స్థానికులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో రాయికోడ్ బస్టాండ్ వద్ద ఆ బస్సును ఆర్టీసీ చెకింగ్ అధికారులు ఆపారు. ఈ నేపథ్యంలో బస్సులో ఉన్న ప్రయాణికుల వద్ద టికెట్లు ఉన్నాయా లేవా అనేది తనిఖీ చేశారు. అయితే ఒక వ్యక్తి టికెట్ తీసుకోలేదని చెకింగ్ అధికారి ప్రకాష్ గుర్తించాడు. బస్సులో ప్రయాణిస్తూ టికెట్ తీసుకోకపోవడంతో ఆ ప్రయాణికుడికి జరిమానా విధించడంతోపాటు సదరు బస్సు కండక్టర్‌పై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ చెకింగ్ అధికారి ప్రకాష్ మాత్రం అక్కడే అవినీతికి తెరలేపాడు. ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్లు ఉండాలంటే తనకు లంచం ఇవ్వాలని ప్రకాష్ డిమాండ్ చేశాడు. ప్రయాణికుడికి ఫైన్ వేయకుండా, కండక్టర్‌కు నోటీసులు జారీ చేయకుండా ఉండేందుకు తనకు రూ.20 వేలు ఇవ్వాలని అడిగాడు. అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు కూడా గమనించారు. లంచం డిమాండ్ చేసిన అవినీతి ఆర్టీసీ అధికారి భరతం పట్టారు. లంచం ఎలా తీసుకుంటావని ప్రశ్నించారు.

రాయికోడ్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే చెకింగ్ అధికారి వాహనాన్ని అడ్డుకుని ప్రయాణికులు నిలదీశారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన కండక్టర్, ప్రయాణికులు కలిసి చెకింగ్ అధికారి ప్రకాష్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాహనంలో కూర్చున్న ప్రకాష్‌ను కాలర్ పట్టుకుని బయటికి లాగారు. అనంతరం దాడి చేశారు. అయినప్పటికీ వారికి ఆగ్రహం తగ్గకపోవడంతో కండక్టర్ చెప్పు తీసి మరీ కొట్టాడు. ఆ తర్వాత మిగిలిన ప్రయాణికులు కూడా చెప్పులు తీసి అధికారిని కొట్టడంతో తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఆర్టీసీ అధికారి ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కండక్టర్, బస్సులోని ప్రయాణికులు సిద్ధమయ్యారు.

 

  Last Updated: 01 May 2026, 02:37 PM IST