Kavitha: కవిత బెయిల్‌ పిటిషన్‌ పై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వు

Kavitha Bail Petitions: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(Kavitha) బెయిల్‌ పిటిషన్ల(Bail Petitions)పై వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి(High Court Judge) స్వర్ణకాంత శర్మ(Swarnakanta Sharma) తీర్పును రిజర్వ్‌(Reserve) చేశారు. బెయిల్‌ పిటిషన్లపై సోమవారం కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ రోజు దర్యాప్తు సంస్థల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తయిన అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే, కవితకు బెయిల్ ఇవ్వొద్దని […]

Published By: HashtagU Telugu Desk
MLC Kavitha

MLC Kavitha

Kavitha Bail Petitions: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(Kavitha) బెయిల్‌ పిటిషన్ల(Bail Petitions)పై వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి(High Court Judge) స్వర్ణకాంత శర్మ(Swarnakanta Sharma) తీర్పును రిజర్వ్‌(Reserve) చేశారు. బెయిల్‌ పిటిషన్లపై సోమవారం కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ రోజు దర్యాప్తు సంస్థల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తయిన అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే, కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ వాదనలు వినిపించాయి. బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌(Delhi Liquor Scam)లో అక్రమ సొమ్ము నేరుగా కవితకు చేరిందని ఈడీ(ED) వాదించింది. కేసులో కవిత కీలక పాత్రధారి అని.. ఇందుకు వాట్సాప్ చాట్, ఇతర ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. కవిత తరఫున న్యాయవాది నితీష్‌ రాణా కౌంటర్‌ వాదనలు వినిపించారు. కేసులో బుచ్చిబాబును నిందితుడిగా చేర్చకపోవడం.. అరెస్టు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బుచ్చిబాబు స్టేట్‌మెంట్లు కోర్టు పట్టించుకోవద్దని.. ఆగస్టు 2023 తర్వాత ఎలాంటి కొత్త సాక్ష్యాలు ఈడీ చూపించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాల ధ్వంసం చేసిన సమయంలో ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.

Read Also: LIC Health Insurance : బీమా రంగంలో సంచలనం.. ‘ఆరోగ్య బీమా’లోకి ఎల్‌ఐసీ

కవిత తన ఫోన్లు పని మనుషులకు ఇచ్చారని.. రూ.190 కోట్ల అక్రమ సొమ్ము చేరిందన్న ఈడీ వాదనలో నిజం లేదన్నారు. దీనిపై ఎలాంటి సాక్ష్యాలు ఈడీ చూపలేదన్నారు. కవిత అరెస్ట్ విషయంలో సీబీఐ చట్ట ప్రకారం నడుచుకోలేదని.. కవిత అరెస్ట్‌కు సీబీఐ కారణాలు చెప్పలేదని పేర్కొన్నారు. ఈడీ వాదనలు వినిపిస్తూ.. కవిత ఈడీకి ఇచ్చిన ఫోన్ల డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందని పేర్కొంది. సూర్యాస్తమయానికి ముందే కవితను అరెస్టు చేశామని.. ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదని.. గోప్యత హక్కును భంగపరచలేదని ఈడీ వాదించింది. ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు బెయిల్‌ పిటిషన్‌ నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసింది.

 

  Last Updated: 28 May 2024, 05:23 PM IST