Congress 6 Guarantees : ఆరు గ్యారెంటీల పట్ల రేషన్ కార్డు లేనివారి ఆందోళన

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 11:09 AM IST

తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహాలక్షి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు , ఆరోగ్య శ్రీ పరిధి పెంచడం చేసిన రేవంత్ సర్కార్..100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను (Congress 6 Guarantees) అమలు చేయాలనీ చూస్తుంది. ఇందుకోసం ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తామని .. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకూ గ్రామ సభల ద్వారా ఆ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ‘అర్హత ఉన్న వారు గ్రామ సభల్లో అధికారులకు అప్లికేషన్లు అందజేయాలి. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన అనంతరం అధికారులు ఓ రశీదు ఇస్తారు. గూడెంలో 10 ఇళ్లు ఉన్నా అధికారులే స్వయంగా అక్కడికి వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారు. స్వీకరణ ప్రక్రియ పూర్తైన అనంతరం వారు ఏ పథకానికి అర్హులో అధికారులే నిర్ణయిస్తారు.’ అని వివరించారు. అయితే రేషన్ కార్డు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని తెలుపడం తో..రేషన్ కార్డు (Ration Card) లేనివారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త కార్డులు జారీ చేసి, గ్యారెంటీలను అమలు చేయడానికి సమయం పడుతుందనే, ఇప్పటికే ఉన్నవారికి అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం చెబుతోంది. కొత్తవి జారీ చేసిన తర్వాత వారికి దరఖాస్తుకు అవకాశం కల్పిస్తామంటుంది.

Read Also : AP Politics: జగన్ ఒక్కడే ఆరుగురు పీకేలతో సమానం: వైసీపీ మంత్రులు