తెలంగాణలో మాస్క్‌ తప్పనిసరి..లేకుంటే రూ. వెయ్యి జరిమానా..

తెలంగాణ‌లో మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఒమైక్రాన్ వేరియంట్ వేగంగా విస్త‌రిస్తున్న నేప‌ధ్యంలో రాష్ట్రంలో ప‌రిస్ధితిపై స‌మీక్ష నిర్వ‌హించిన స‌ర్కార్‌.. ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది.

తెలంగాణ‌లో మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఒమైక్రాన్ వేరియంట్ వేగంగా విస్త‌రిస్తున్న నేప‌ధ్యంలో రాష్ట్రంలో ప‌రిస్ధితిపై స‌మీక్ష నిర్వ‌హించిన స‌ర్కార్‌.. ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది.

 

మాస్క్, వ్యాక్సిన్ పై తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు

మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా వేయాలని పోలీసు శాఖకు సూచించిన వైద్యశాఖ

మాస్క్ ఖచ్చిత0గా ధరించాలి

బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలి

వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే

వ్యాక్సిన్ పై ఖచ్చితమైన నిబంధనలు ప్రభుత్వ అనుమతితో రూపొందించబోతున్నాం

హోటల్, పార్క్, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా వ్యాక్సినేషన్ పత్రం ఖచ్చితం చేయాలని నిర్ణయం

వ్యాక్సిన్ వేసుకొనివారికి ఎక్కడికెళ్లినా త్వరలో నో ఎంట్రీ రూల్

రిస్క్ దేశాల నుంచి వచ్చిన 325 మంది విదేశీ ప్రయాణికులకు టెస్టులు నిర్వహించాము

35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్, టిమ్స్ లో ట్రీట్మెంట్ చేస్తున్నాం

జీనోమ్ సిక్వీన్స్ కి నమూనాలు పంపించాం… ఫలితాలు రావడానికి రెండు రోజుల సమయం పడుతుంది

సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు

రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన 325 మంది ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నాం

మరోవైపు.. వ్యాక్సిన్లు ప్రాణాలను రక్షిస్తాయి.. ప్రజల చెంతకు వ్యాక్సిన్లు వస్తున్నాయి… సద్వినియోగం చేసుకోవాలని సూచించారు శ్రీనివాసరావు.. 5.90 లక్షల మంది హైదరాబాద్ లో, 4.80 లక్షల మంది మేడ్చల్ లో, 4.10 లక్షల మంది రంగారెడ్డిలో రెండో డోస్ వేసుకోవాల్సి ఉందన్నారు.. తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల మంది రెండో డోస్ తీసుకోవాల్సి ఉందని.. వీరంతా వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. వ్యాక్సిన్ వేసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారని గుర్తుశారు.. ఇక, వ్యాక్సిన్ కంటే అత్యంత రక్షణ కవచం మాస్క్… మాస్క్ ఖచ్చితంగా ధరించాలని సూచించిన ఆయన.. మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా వేయాలని పోలీసులకు సూచించాం.. బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలన్నారు.. వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే.. వ్యాక్సిన్ పై ఖచ్చితమైన నిబంధనలు ప్రభుత్వ అనుమతితో రూపొందించబోతున్నాం అన్నారు డీహెచ్‌ శ్రీనివాసరావు.