Praja Bhavan : బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫై పిర్యాదులే పిర్యాదులు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Mallareddy) తమ భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ప్రజాభవన్ లో పిర్యాదులు చేసారు. సోమాజిగూడలోని ప్రజా భవన్ వద్ద శుక్రవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గుండ్ల పోచంపల్లిలో తమ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశాడంటూ దాదాపు 700 మంది ర్యాలీగా వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణా […]

Published By: HashtagU Telugu Desk
Huge Response To Prajavani

Huge Response To Prajavani

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Mallareddy) తమ భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ప్రజాభవన్ లో పిర్యాదులు చేసారు. సోమాజిగూడలోని ప్రజా భవన్ వద్ద శుక్రవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గుండ్ల పోచంపల్లిలో తమ భూమిని మల్లారెడ్డి కబ్జా చేశాడంటూ దాదాపు 700 మంది ర్యాలీగా వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు. కాప్రా సర్వేనెంబర్ 647/1, 648& 654లో భూమిని మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టారు. మంగళవారం, శుక్రవారం సచివాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతూ..తమ సమస్యలను , తమ అర్హతలకు అందాల్సిన లబ్దితోపాటు భూ అక్రమణలపై ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా మంత్రి మల్లారెడ్డి తమ భూములు కాజేశారని పిర్యాదులు వచ్చాయి. ఫేక్‌ డాక్యుమెంట్స్‌తో మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తన భూమిలోని 360 ప్లాట్లలో 110 ప్లాట్లు మల్లారెడ్డి కబ్జా చేశారని ఒక రైతు ఆరోపణలు చేశారు. తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే అధికారం అడ్డంపెట్టకుని బెదిరింపులకు పాల్పడ్డారని, గతంలోనూ దీనిపై న్యాయం పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. గుండ్ల పోచంపల్లిలో పలు సర్వే నెంబర్లలతో భూమి కబ్జా చేసారని వారంతా ఆరోపిస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read Also :

  Last Updated: 05 Jan 2024, 12:58 PM IST