Site icon HashtagU Telugu

Lok Sabha Polls : బిజెపి – బిఆర్ఎస్ మద్యే పోటీ – కెసిఆర్

Kcr Bjp Brs

Kcr Bjp Brs

లోక్ సభ ఎన్నికల్లో బిజెపి – బిఆర్ఎస్ (BJP-BRS) మద్యే పోటీ అని..కాంగ్రెస్ పార్టీ (Congress Party) మూడో స్థానానికే పరిమితమన్నారు బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్. ఈరోజు పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్‌లో బస చేసిన కేసీఆర్.. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డితో సమావేశమై..ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చలు జరిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఫై ప్రజలు ఆగ్రహం గా ఉన్నారని..దొంగ హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చారని, గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కొట్టేవిధంగా ఆగ్రహంతో ఉన్నారని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని వాటిని పట్టించుకునే నాధుడు లేడని , ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా ఉండాలని , కాంగ్రెస్ ఫై యుద్ధం చేయాలనీ , ప్రజల సమస్యల ఫై ఎక్కడిక్కడే ప్రభుత్వాన్ని నిలదీయాలని , రాష్ట్ర ప్రభుత్వ హామీలు, విద్యుత్తు, మంచినీరు, సాగునీరు తదితర సమస్యలను తెరపైకి తీసుకొస్తూ ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించాలని కేసీఆర్ సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌తో మనకు పోటీ లేదు. బీజేపీ తోటే పోటీ. మీరు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే తప్పకుండా మన అభ్యర్థులు గెలుస్తారని హితబోధ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే సోషల్ మీడియా లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ ..వరుస ట్వీట్స్ తో దూసుకెళ్తున్నారు. ముందుగా పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన కేసీఆర్..ఆ తర్వాత కరెంట్ కటింగ్ ఫై ట్వీట్ చేసారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు. నాతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి అని కేసీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read Also : Tapping Tillu : కేటీఆర్ పై బీజేపీ డీజే టిల్లు ట్రోల్ సాంగ్