Site icon HashtagU Telugu

Bhoiguda: సికింద్రాబాద్ బాధిత కుటుంబాలకు పరిహారం!

Kcr

Kcr

సికింద్రాబాద్ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. కాగా అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించినవారికి ఒక్కొక్కరికీ రూ 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

దీనిపై ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఆయా కుటుంబాలకు రెండు లక్షల రూపాయ‌ల‌ చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. మ‌రోవైపు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాదంలో వలస కార్మికుల సజీవ దహనం బాధాకరమ‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని చెప్పారు. ఉపాధి కోసం బీహార్ నుంచి వ‌ల‌స వ‌చ్చిన కూలీలు ఈ దుర్ఘ‌ట‌న‌లో మృత్యువాత ప‌డ‌టం అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.