Site icon HashtagU Telugu

CM KCR: కేసీఆర్ తో కమ్యూనిస్టు నేతల భేటీ!

CM KCR and Kerala CM

CM KCR and Kerala CM

సిపిఐ, సిపిఎం పార్టీల జాతీయ అగ్రనాయకత్వం శనివారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. శుక్రవారం నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు జరుగునున్న కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సిపిఎం పార్టీ జాతీయ నేతలు హైద్రాబాద్ కు రాగా… సిపిఐ పార్టీ అనుబంధ అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు సిపిఐ నేతలు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రగతి భవన్ కు విడి విడిగా వచ్చిన ఉభయ కమ్యునిస్టు పార్టీల నేతలు పలు జాతీయ రాజకీయాలు, తెలంగాణ అభివృద్ధి తదితర అంశాలపై సిఎం కెసిఆర్ తో చర్చించారు.
ఈ సందర్భంగా సమావేశంలో… సిపిఎం అగ్రనేతలు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్., త్రిపుర మాజీ సిఎం మాణిక్ సర్కార్, సిపిఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిల్లై , బాల కృష్ణన్, ఎం ఎ బేబీ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జె. సంతోష్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు.

CM KCR and Kerala CM