Site icon HashtagU Telugu

Violence : రాష్ట్రంలో మత హింసలు పెరిగిపోతున్నాయి – కేటీఆర్

Medak Violence

Medak Violence

కేసీఆర్ (KCR) గారి పాలనలో గత 9.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎలాంటి మత హింసలు జరగకుండా తెలంగాణ శాంతియుతంగా ఉంది..కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వంలో ఎక్కడ చూసిన మత హింసలు, ఉద్రికత్తలు , గొడవలు జరుగుతున్నాయని, మతపరమైన కార్యకలాపాలు లేని ప్రశాంతమైన మెదక్ (Medak) పట్టణం ఇప్పుడు అస్తవ్యస్తంగా మారిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ట్విట్టర్ వేదిక గా ఆగ్రహం వ్యక్తం చేసారు.

అసలు ఏంజరిగిందంటే..

We’re now on WhatsApp. Click to Join.

మెదక్‌ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కోలిగడ్డకు చెందిన రాజ్‌అరుణ్‌ అనే యువకుడికి కడుపు, చేతిపై కత్తిపోట్లు పడ్డాయి. అతని వర్గీయులు వెళ్లి రాంనగర్‌లో కొందరిని పట్టుకోగా అక్కడా తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో అతని వర్గీయులపై మరో వర్గం రాళ్ళతో దాడి చేసింది. గాయపడిన యువకుల వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో చేరుకుని… రాళ్ల దాడి చేసిన వారు ఒక ప్రైవేటులో ఆస్పత్రిలో ఉన్నారని భావించి కర్రలతో ఆ ఆస్పత్రి అద్దాలను, ముందు నిలిపి ఉన్న కారును ధ్వంసం చేశారు. యువకులు తిరిగి వెళ్లే మార్గంలో ఓ హోటల్‌ అద్దాలను. పాత బస్టాండ్‌ వద్ద పలు పాన్‌ షాపులను ధ్వంసం చేశారు. అలాగే మరోవైపు కోలిగడ్డలో ఓ ఇంటిపై ఒక వర్గం వారు రాళ్లు విసిరారు. ఇలా పరస్పర దాడులతో పట్టణం అట్టుడికింది. ఈ ఘటనల ఫై మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.

కేసీఆర్ గారి పాలనలో గత 9.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎలాంటి మత హింసలు జరగకుండా తెలంగాణ శాంతియుతంగా ఉంది..కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎక్కడ చూసిన మత హింసలు, ఉద్రికత్తలు , గొడవలు జరుగుతున్నాయని, మతపరమైన కార్యకలాపాలు లేని ప్రశాంతమైన మెదక్ పట్టణం ఇప్పుడు అస్తవ్యస్తంగా మారిందని వాపోయాడు. అలాగే దాడులకు సంబదించిన వీడియోస్ ను షేర్ చేసారు.

ఇదొక్కటే కాదు రాష్ట్రంలో వరుసగా అనేక దాడులు జరుగుతున్నాయి. శాంతిభద్రతల పర్యవేక్షణపై పోలీస్‌ ఉన్నతాధికారులు శీతకన్ను వేసింది. కిందిస్థాయి యంత్రాం గం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది. మొత్తంగా తెలంగాణలో లా అండ్‌ ఆర్డర్‌ గాడితప్పింది అని చెప్పాలి. రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న హత్యలు, దాడులే నిదర్శనం. నిన్నటివరకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో నేడు అశాంతి జ్వాల చెలరేగుతున్నది. ఈ పరిణామాలు రాష్ట్ర ప్రజానీకాన్ని భయపెడుతున్నాయి. ప్రభుత్వ పాలన వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. మరి వీటిపై సీఎం రేవంత్ త్వరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. లేదంటే రోజు రోజుకు దాడులు ఎక్కువైపోతాయి.

Read Also : V. Hanumantha Rao : సొంత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన వీ హనుమంతరావు

Exit mobile version