Praja Bhavan : కేసీఆర్ కుర్చీలో సామాన్యులు ..

ప్రగతి భవన్ (Pragathi Bhavan)..ఇది మొన్నటివరకు వినిపించినపేరు..ఇప్పుడు ప్రజా భవన్ (Praja Bhavan)..ప్రజలందరి భవన్ గా పిలువబడుతుంది. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆయన మొట్టమొదట చేసిన పని తొమ్మిది ఎకరాల్లో తనకు నచ్చిన విధంగా రాజభవనం కట్టుకున్నాడు. పేరుకి ప్రగతిభవనైన దాంట్లో ఏనాడు సామాన్యులకు కాదు ఆ పార్టీ నేతలకు కూడా అనుమతి ఇచ్చింది లేదు. ఏనాడు సెక్రటేరియట్ కి రాని కేసీఆర్..అన్ని ప్రగతి భవన్ నుండే చూసుకునేవారు. అసలా ఆ భవన్లో ఏముంటుందో కూడా ఎవరికి […]

Published By: HashtagU Telugu Desk
Prajabhavan Kcr

Prajabhavan Kcr

ప్రగతి భవన్ (Pragathi Bhavan)..ఇది మొన్నటివరకు వినిపించినపేరు..ఇప్పుడు ప్రజా భవన్ (Praja Bhavan)..ప్రజలందరి భవన్ గా పిలువబడుతుంది. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆయన మొట్టమొదట చేసిన పని తొమ్మిది ఎకరాల్లో తనకు నచ్చిన విధంగా రాజభవనం కట్టుకున్నాడు. పేరుకి ప్రగతిభవనైన దాంట్లో ఏనాడు సామాన్యులకు కాదు ఆ పార్టీ నేతలకు కూడా అనుమతి ఇచ్చింది లేదు. ఏనాడు సెక్రటేరియట్ కి రాని కేసీఆర్..అన్ని ప్రగతి భవన్ నుండే చూసుకునేవారు. అసలా ఆ భవన్లో ఏముంటుందో కూడా ఎవరికి తెలియదు. అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. ప్రగతి భవన్ లోపల చూసిన వాళ్లు కూడా చాలా తక్కువ. ఎంత సేపు బయట నుండి చూసేవాళ్ళే..తప్ప లోనికిపోయింది లేదు. అలాంటి కోటాలోకి..అధికారంలోకి వచ్చిన మొదటిరోజే సీఎం రేవంత్ సామాన్యులకు అవకాశం కల్పించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ (Pragathi Bhavan)కు ‘ప్రజా భవన్’ అని పేరు పెడతామని..ప్రజల సమస్యలు తీర్చే ప్రజా దర్భార్ గా మారుస్తామని..ఈ భవన్ తలుపులు 24 గంటలు ప్రజల కోసం తెరిచే ఉంటాయని చెప్పినట్లే రేవంత్ చేసాడు. ప్రతి మంగళవారం , శుక్రవారం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి కి ప్రగతిభవన్లో ఒక భాగాన్ని ఆయన అధికార నివాసంగా కేటాయించారు. మరోపక్క సామాన్య ప్రజలు వెళ్లి తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం ఇచ్చారు. ఆలా లోనికి వచ్చిన వారు ప్రగతి భవన్ ను అంత చూస్తూ..వామ్మో ఎంత బాగుంది అని మాట్లాడుకోవడం..మొన్నటి వరకు కెసిఆర్ కూర్చున్న కుర్చీ పై కసిగా విలాసంగా కూర్చుని ఫోటోలు దిగడం చేస్తున్నారు.

Read Also : Kothimeera Rice: ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్.. ఇలా చేస్తే లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

  Last Updated: 18 Dec 2023, 03:34 PM IST