ఎస్సీ వర్గీకరణ (SC Categorisation)కు కట్టుబడి ఉన్నామని..త్వరలోనే వర్గీకరణకు కమిటీ వేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎలాగైనా ఈసారి కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి (BJP) పార్టీ పక్క వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే బిజెపి అధికారంలోకి వస్తే బీసీ నేతనే సీఎం (BC CM) చేస్తామని ప్రకటించగా..దానిని ప్రచారంలో బాగా వాడుకుంటుంది. ఇప్పటికే బరిలో నిల్చున్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తుండగా..కేంద్ర మంత్రులు , ప్రధాని సైతం ప్రచారంలో పాల్గొంటూ మరింత ఉత్సహం నింపుతున్నారు. మూడు రోజుల క్రితం బీసీ సభ (BC Sabha) నిర్వహించి సక్సెస్ చేసిన నేతలు..ఈరోజు బీజేపీ మాదిగ విశ్వరూప సభ (Madiga Vishwarupa Sabha) పేరుతో మరో భారీ సభ నిర్వహించారు.
సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పటు చేసిన ఈ సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. సభావేదికగా ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశముందని అంత అనుకున్నట్లే..ప్రధాని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామన్నారు. అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేరుస్తామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాదిగలను విరోధులుగా చూస్తున్నాయని మోడీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రేమతో మందకృష్ణ (Manda Krishna Madiga) తమ్ముడు ఈ సభకు తనను ఆహ్వానించారన్నారు. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. మాదిగల ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని మోడీ తెలిపారు.
అలాగే బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల ఫై మోడీ ఫైర్ అయ్యారు. సాధారణంగా అభివృద్ధి విషయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటాయి కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో అవినీతి విషయంలో కలిసి పని చేస్తోందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. ఇలా అవినీతి కోసం ప్రభుత్వాలు కలిసి పని చేయడం మొదటిసారి చూస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద మద్దతుదారు అని తెలిపారు. అలాంటి ఆప్ తో కలిసి బీఆర్ఎస్ అవినీతికి పాల్పడుతోందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తుందని మోడీ ఆరోపించారు. దళిత నేతను సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాటతప్పారన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారని, ఆ హామీని నెరవేర్చలేదన్నారు. అలాగే రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. దళిత బంధు పథకం కేవలం బీఆర్ఎస్ నేతలకు మాత్రమే ఇస్తున్నారని మోడీ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడలేకపోయారన్నారు. దళిత బంధు పథంతో బీఆర్ఎస్ నేతలకే మేలు జరిగిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలేనన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరితో ఒకరు పోటీపడుతున్నట్టు నటిస్తున్నారని మోడీ విమర్శించారు.
Read Also : Congress TV Ads : కాంగ్రెస్ ప్రచారం ఫై ఈసీ కి బిఆర్ఎస్ పిర్యాదు