Site icon HashtagU Telugu

telangana-govt : కాంగ్రెస్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. 44 నుంచి 46 ఏళ్లకు వయోపరిమిత పెంపు

Comgress Govt Issues Orders Regarding Age Relaxation For Job Notifications

Comgress Govt Issues Orders Regarding Age Relaxation For Job Notifications

telangana-govt: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని(age-relaxation) పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 44 ఏళ్ల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగ నియామకాల వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా మిగతా ఉద్యోగాలకు 46 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
We’re now on WhatsApp. Click to Join.

గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూనే నిరుద్యోగులు ఏజ్ బార్ అయిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(cm revanth reddy) ఇటీవల పేర్కొన్నారు. వారికి న్యాయం చేసేందుకు వయోపరిమితిని పెంచుతామని ప్రకటించారు. ఈమేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Shanti Kumari) జీవో విడుదల చేశారు. గ్రూప్ 1 సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచారు.

మరోవైపు మేడిగడ్డపై కాంగ్రెస్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు మేడిగడ్డకు రావాలని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలకు కాంగ్రెస్‌ సర్కార్‌ లేఖ రాసింది. రేపు మేడిగడ్డ సందర్శనకు రావల్సిందిగా బీఆర్ఎస్, బిజెపి,ఏంఐఎం, సీపీఐ పార్టీ అధ్యక్ష్యులకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.

read also :Pakistan : పాకిస్థాన్‌లోప్రభుత్వ ఏర్పాటుకు నెలకొన్న ప్రతిష్ఠంభన !