Site icon HashtagU Telugu

Vijayabheri Yatra: కేసీఆర్..కేటీఆర్ కర్ణాటకకు రండీ .. డీకే శివకుమార్

Vijayabheri Yatra

Vijayabheri Yatra

Vijayabheri Yatra: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును చూసేందుకు రాష్ట్ర మంత్రులతో కలిసి కర్ణాటక రావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ లను డీకే శివకుమార్ ఆహ్వానించారు. ఈ రోజు తాండూరులో జరిగిన కాంగ్రెస్ ‘విజయభేరి యాత్ర’లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో విద్యుత్ సరఫరాపై ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై డీకే మాట్లాడుతూ.. “గృహ జ్యోతితో కర్ణాటకలోని అన్ని గృహాలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్నాం. కర్ణాటకలో మా హామీలను నిలబెట్టుకున్నాం. అయితే గత దశాబ్ద కాలంగా కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అంటూ ప్రశ్నించారు.

డీకే శివకుమార్ తన 2014 నుండి 2018 వరకు ఇంధన శాఖ మంత్రిగా తన పదవీకాలాన్ని ప్రస్తావిస్తూ కర్ణాటకలో విద్యుత్ ఉత్పత్తిని 10,000 మెగావాట్ల నుండి 23,000 మెగావాట్లకు పెంచాము. గడచిన నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం కరెంటు ఇవ్వడంలో విఫలమైందని, అయితే కరువు సమయంలో ప్రతి రైతుకు 5 గంటల కరెంటు ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 7 గంటల విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటకకు ఇచ్చిన హామీల కంటే తెలంగాణకు కాంగ్రెస్ వాగ్దానం చేసిన ఆరు హామీలు బెటరంటూ పేర్కొన్నారు. కర్ణాటకలో 1.5 కోట్ల మంది మహిళలు గృహలక్ష్మి పథకం కింద రూ.2,000 పొందుతున్నారు. ప్రతి ఇంటికి 10 కిలోల బియ్యం ఉచితంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చాము. తెలంగాణాలో కూడా ఇవే పధకాలు అమలవుతాయి. సీనియర్ సిటిజన్లకు 4,000 రూపాయలు అందజేస్తాము. ప్రతి రైతుకు రూ.15వేలు, వ్యవసాయ కూలీలందరికీ రైతు భరోసా కింద 12వేలు అందజేస్తామని, విద్యార్థులందరికీ ఉన్నత విద్య కోసం ఐదు లక్షల రూపాయలు అందజేస్తామని చెప్పారు.

2014లో కొత్త తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సోనియా గాంధీ తన హామీని నెరవేర్చారు. ఇప్పుడు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన సమయం వచ్చింది అని ఆయన అన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ హామీలను నెరవేర్చింది. అయితే పదేళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చారా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.రాష్ట్రంలో ఎన్నికల తర్వాత కేసీఆర్ మరియు ఆయన కుటుంబం తమ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోవచ్చని, తెలంగాణలో కాంగ్రెస్ పాలన సాగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Telangana: కన్నీళ్లతో కాంగ్రెస్‌కు గొట్టిముక్కుల వెంగళరావు రాజీనామా