కల్తీ…కల్తీ ఎక్కడ చూడు..ఏ వస్తువు చూడు అంత కల్తీమయమే..ప్రతి దాంట్లో కల్తీ చేస్తున్నారు. ముఖ్యంగా నిత్యావసరాలను కల్తీగా మార్చేస్తున్నారు..చిన్న పిల్లలు తాగే పాల దగ్గరి నుండి బియ్యం , పసుపు ఇలా అన్నింట్లో కెమికల్ వాడుతూ కల్తీ చేస్తున్నారు. నిత్యావస రాలైన ఏ సరుకు కొన్నా కల్తీ. ప్రతిరోజూ ఏదోఒక చోట ప్రతి వస్తువులో కల్తీ కలుపుతూ పట్టుబడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
మార్కెట్‌లో అందుబాటులో ఉండే సరుకులు, ఆహార పదార్థాలు అన్నీ కల్తీమయమే. మనం తినే రకరకాల పండ్లను కాయల స్థితి నుంచే వాటిని కృత్రిమంగా పండేలా చేస్తున్నారు. పప్పు, బియ్యం, పంచదార, పాలు, నీరు ఇలా అన్నీ కల్తీయే. వీటిని తినడం వలన ఆరో గ్యాలు దెబ్బతింటున్నాయి. ప్రపంచంలో కల్తీలేని ఆహా రం దొరికే పరిస్థితి లేదు. కల్తీ ఆహారం వలన రకరకాల వ్యాధులు వస్తున్నాయి. తాగునీరు, బియ్యం, టీ, కారంపొడి, నూ నెలు, మిఠాయిలు, పప్పులు, నెయ్యి, ఐస్‌క్రీమ్, స్టెరాయిడ్లతో పెరిగే కోళ్లు, పొట్టేళ్ల మాంసంతో సహా అంతా కల్తీ అవు తోంది. రుచి కోసం తాగునీటిలో సైతం కొన్ని సం స్థలు రసాయనాలు కలుపుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
చౌకబియ్యాన్ని డబుల్ పాలిష్ పట్టి సన్నబియ్యంగా మారుస్తూ చిక్కుతున్న విషయం తెలి సిందే. పంచదారలో సోడా, రవ్వ కలుపుతున్నారు. కం దిపప్పులో కేసరిపప్పు, పిండి, యూరియా లాం టివి కలిపి విక్రయిస్తున్న ట్లు పలు తనిఖీల్లో బయటపడింది. రైస్‌బ్రాండ్ ఆయిల్స్, తౌడు ఆ యిల్, పామాయిల్‌లో కల్తీ కలిపి తక్కువ ధరకు మార్కెట్ లో అమ్ముతున్నారు. తాజాగా మిర్చి కి సైతం కలర్ వేసి మార్కెట్ లో అమ్ముతున్నారు. దీనికి సంబదించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో చూసి అంత భయపడుతున్నారు. మార్కెట్ లో ఏది మంచిదో..కాదో తెలియడం లేదని వాపోతున్నారు.
ఆఖరికి ఎండుమిర్చి కి కూడా రంగులు వేస్తున్నారు కల్తీకి కాదేది అనర్హత అన్నట్టుగా చివరకు మిరపకాయలను కూడా వదలట్లేదు 🤦♂️ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. pic.twitter.com/5cgdDkyODe
— YasinOnX (@YaasinOnX) March 2, 2024
Read Also : AP : రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుపెట్టిన సీఎం జగన్..ఇంతకన్నా దారుణం మరోటి ఉండదు