MLA Danam Nagender : ఎమ్మెల్యే దానం కు వ్యతిరేకంగా ప్రజాభవన్ వద్ద ఆందోళలన

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) తమ భూములు కబ్జా చేశాడంటూ బేగంపేట్ బస్తీ వాసులు ప్రజా భవన్ (Praja Palana) వద్ద ఆందోళన చేపట్టారు. సోమాజిగూడలోని ప్రజా భవన్ వద్ద మంగళవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ భూమి కబ్జా చేశారని బేగంపేటలోని ప్రకాష్ నగర్ ఎక్స్‌టెన్షన్ బస్తీ ప్రాంతానికి చెందిన బాధితులు ఫ్లెక్సీలు, ప్లకార్డ్స్ పట్టుకొని ఆందోళన చేశారు. We’re now on WhatsApp. Click to Join. […]

Published By: HashtagU Telugu Desk
Danam

Danam

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) తమ భూములు కబ్జా చేశాడంటూ బేగంపేట్ బస్తీ వాసులు ప్రజా భవన్ (Praja Palana) వద్ద ఆందోళన చేపట్టారు. సోమాజిగూడలోని ప్రజా భవన్ వద్ద మంగళవారం జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ భూమి కబ్జా చేశారని బేగంపేటలోని ప్రకాష్ నగర్ ఎక్స్‌టెన్షన్ బస్తీ ప్రాంతానికి చెందిన బాధితులు ఫ్లెక్సీలు, ప్లకార్డ్స్ పట్టుకొని ఆందోళన చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ భూమిని తాము కష్టపడి కొనుక్కున్నామని, ఇప్పుడు ఆ భూమి నుంచి తమను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. తమ భూమిలో కట్టుకున్న ఇళ్లను కూలగొట్టిస్తామని బెదిరిస్తున్నారంటూ బాధితులు కొందరు కన్నీటిపర్యంతమయ్యారు. ఎమ్మెల్యే దానం, ఆయన అనుచరుల ఆగడాల నుంచి కాపాడాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మరి దీనిపై సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇదిలా ఉంటె రెండు రోజుల బ్రేక్ తర్వాత ఈరోజు ప్రజా పాలన కార్యక్రమం మొదలైంది. ఆదివారం, న్యూఇయర్ సందర్భంగా రెండు రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమానికి బ్రేక్ పడింది. తిరిగి ఈరోజు నుంచి యధావిధిగా ప్రజాపాలన-అభయహస్తం దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. డిసెంబర్ 30 వరకు అంటే మూడు రోజుల్లో 9.92 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతిలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్‌, మహాలక్ష్మి పథకంలో నెలకు రూ.2500, రాయితీపై రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ వంటి పథకాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేస్తున్నారు.

Read Also : Online Shopping : ఆన్‌ లైన్‌ షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. జీమెయిల్‌ లో సరికొత్త ఫీచర్స్ మీకోసమే..

  Last Updated: 02 Jan 2024, 01:13 PM IST