Site icon HashtagU Telugu

Hyderabad Winter : 10 ఏళ్ల‌లో అత్యంత చ‌లి రోజు

Winter

Winter

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో దశాబ్దంలోనే డిసెంబర్‌ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీలు, పటాన్‌చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో 2015 డిసెంబర్‌ 13న హైదరాబాద్‌లో అతితక్కువగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వచ్చే మూడు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ వాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 6.5 డిగ్రీలు, మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లెలో 7.1 డిగ్రీలు, జహీరాబాద్‌ మండలం సత్వార్‌ గ్రామంలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయినట్టు అధికారులు పేర్కొన్నారు.