Site icon HashtagU Telugu

Cock Fight : హైదరాబాద్ శివారులో కోడిపందాలు…21మంది అరెస్టు…పరారీలో చింతమనేని..!!

Cock Fight

Cock Fight

హైదరాబాద్ శివారు ప్రాంతంలో కోడిపందాలు కలకలం రేపాయి. చాలా రోజులుగా అక్కడ కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టి పందెం రాయుళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే మొత్తం 70మందితో కలిసి పెద్దెత్తున సాగుతున్న బెట్టింగ్ కోడి పందేలు నిర్వహిస్తుంటే…కచ్చితమైన సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు. అప్పటికే జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి.

కానీ పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో 49మంది అక్కడి నుంచి పరారయ్యారు. మిగిలిన 21మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పందాల ప్రధాన నిర్వాహకుడు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురునిర్వహకులు అక్కినేని సతీష్, బర్ల శ్రీనులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ అప్పటికే పోలీసులు వచ్చారన్న విషయం తెలియడంతో చింతమనేని పరారీ అయ్యారని పట్టుబడ్డవారు పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తోంది.

Exit mobile version