Site icon HashtagU Telugu

Hydraa : సీఎం అంకుల్ మా ఇల్లు కూల్చొద్దు ప్లీజ్ ..అంటూ రోడ్డెక్కిన చిన్నారులు

Cm Uncle Please Don't Demol

Cm Uncle Please Don't Demol

మూసీ (Musi) ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు రోజులుగా మూసి పరివాహక ప్రాంతాల్లో సర్వే చేస్తూ అక్రమ ఇళ్లను గుర్తిస్తున్నారు. ఆపరేషన్‌ మూసీ పేరుతో తమ ఇండ్లకు మార్కింగ్‌ చేయడంపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేయడానికి వస్తున్న అధికారులను అడ్డుకుంటున్నారు. మూసీ సుందరీకరణకోసం తమ బతుకులను ఛిద్రం చేస్తున్నారంటూ మండిపడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనబాటపట్టారు. రెండు రోజులుగా మూసి పరివాహక వాసులంతా రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలియజేస్తూ వస్తున్నారు. ఈరోజు ఆదివారం కూడా ఎంతోమంది బాధితులు రోడ్ల పైకి వచ్చారు. ఈరోజు సెలవు దినం కావడం తో చిన్నారులు సైతం తమ తల్లిదండ్రులతో కలిసి నిరసనలో పాల్గొనడం అందర్నీ కలిచి వేస్తుంది.

హైదర్శకోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మా ఇండ్లు కూల్చొద్దు అంటూ ప్లకార్డులతో భాదిత కుటుంబాలు, చిన్నారులు నిరసన తెలిపారు. చిన్నారులు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మా ఇల్లు మాకు కావాలి.. ప్లీజ్ హెల్ప్ చేయండి.. అని ఓ చిన్నారి మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మేము రోడ్డున పడతాం.. హైడ్రా ప్లీజ్ మా ఇండ్లు కూల్చొద్దు.. మా పేరెంట్స్ గురించి బాధ అయితుంది.. అంటూ మరో చిన్నారి మీడియాతో మాట్లాడింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో కొంత మంది నెటిజన్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిన్న పిల్లలను కూడా రోడ్డెక్కించేలా చేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Parenting Tips : ఈ మూడు విషయాలను పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాలి.. ఎందుకంటే..?